Raghava Lawrence : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్‌.. ఆనందంగా ఉందంటూ పోస్ట్

రాఘ‌వ లారెన్స్ తాను గురువుగా భావించే సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) ఇంటికి వెళ్లారు. ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నారు.

Raghava Lawrence : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్‌.. ఆనందంగా ఉందంటూ పోస్ట్

Raghava Lawrence Met Rajinikanth

Updated On : September 26, 2023 / 6:36 PM IST

Raghava Lawrence Met Rajinikanth : రాఘవ లారెన్స్ (Raghava Lawrence) న‌టిస్తున్న సినిమా ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). సెప్టెంబ‌ర్ 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో రాఘ‌వ లారెన్స్ తాను గురువుగా భావించే సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) ఇంటికి వెళ్లారు. ఆయ‌న ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా లారెన్స్ తెలియ‌జేస్తూ అందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశారు.

“ఈ రోజు నా గురువు, త‌లైవా ర‌జినీకాంత్ ను క‌లిశాను. ‘జైలర్‌’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచినందుకు అభినందనలు తెలిపాను. అలాగే.. ‘చంద్రముఖి-2’ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. త‌లైవా నిజంగా చాలా గొప్ప వ్యక్తి.” అని రాఘ‌వ లారెన్స్ ట్వీట్ చేశారు.

పి.వాసు దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చంద్ర‌ముఖి-2 సినిమాలో కంగనా రనౌత్ (Kangana Ranaut) హీరోయిన్. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్ర‌హీత ఎంఎం కీర‌వాణి (MM Keeravaani) సంగీతాన్ని అందిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 15నే విడుద‌ల చేయాల‌ని భావించ‌గా కొన్ని కార‌ణాల వ‌ల్ల 28కి వాయిదా వేశారు. ఇక ఈ సినిమా 2005లో ర‌జినీకాంత్ న‌టించిన ‘చంద్ర‌ముఖి’ చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కింది.

Peddha Kapu 1 : మూవీకి ‘పెద్ద కాపు’ అని టైటిల్ ఎందుకు పెట్టారు.. ఆ సామజిక వర్గం గురించేనా..?