Raghavendra Rao: దర్శకేంద్రుడి తర్వాత సినిమా యాదాద్రి చరిత్రపైనే!

వలం కమర్షియల్ చిత్రాలతోనే కాదు భక్తిరస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యగల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. భక్తిరస చిత్రాలు తీయడంలో దర్శకేంద్రుడు తనకి తానే సాటి..

Raghavendra Rao: దర్శకేంద్రుడి తర్వాత సినిమా యాదాద్రి చరిత్రపైనే!

Raghavendra Rao

Updated On : October 17, 2021 / 11:34 AM IST

Raghavendra Rao: కేవలం కమర్షియల్ చిత్రాలతోనే కాదు భక్తిరస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యగల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. భక్తిరస చిత్రాలు తీయడంలో దర్శకేంద్రుడు తనకి తానే సాటి అనిపించుకున్నారు.
అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి, ఓం నమో వేంకటేశాయ వంటి భక్తిరస సినిమాలను తెరకెక్కించిన రాఘవేంద్రరావు.. చాలా సంవత్సరాల తరువాత మరోసారి భక్తిరస చిత్రాన్ని రూపొందించేందుకు ఆసక్తిగా ఉన్నారు.

Yadadri : యాదాద్రిలో లక్ష పుష్పార్చన, భక్తిభావం ఉట్టిపడేలా స్వాగత తోరణం

విజయదశమి సందర్భంగా తాజాగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన దర్శకేంద్రుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి క్షేత్రం భవిష్యత్తులో మరో తిరుమలగా పేరొందుతుందని, కృష్ణశిలతో రూపొందించడం మహాత్కార్యంగా అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌ది మహాయజ్ఞమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రుడు యాదాద్రిపై ఆధ్యాత్మిక చలనచిత్రాన్ని తీయాలని కోరిక ఉందని తెలిపారు.

Raghavendrarao : రాఘవేంద్రరావు హీరోగా మరో సినిమా..

గతంలో కూడా ఒకసారి రాఘవేంద్రరావు యాదాద్రి చరిత్ర, వైభవంపై సినిమా తీసేందుకు ఆసక్తి చూపించారు. కానీ.. ఆతర్వాత యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, ఆ తర్వాత కరోనా పరిస్థితులతో అది మరుగునపడింది. కాగా, ఇప్పుడు ఆయన దర్శకత్వ పర్వేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD విడుదల తర్వాత దర్శకేంద్రులు మరోసారి యాదాద్రి దర్శనానికి వెళ్లగా మరోసారి యాదాద్రి వైభవంపై ఆధ్యాత్మిక సినిమాను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.