Yadadri : యాదాద్రిలో లక్ష పుష్పార్చన, భక్తిభావం ఉట్టిపడేలా స్వాగత తోరణం

లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సర్వేషామేకాదశి పర్వదినం సందర్భంగా...లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Yadadri : యాదాద్రిలో లక్ష పుష్పార్చన, భక్తిభావం ఉట్టిపడేలా స్వాగత తోరణం

Yadadri

Laksha Pushparchana : తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన యాదాద్రి పునర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు..యదావిధిగా స్వామి వారిక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సర్వేషామేకాదశి పర్వదినం సందర్భంగా…లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలు చేశారు. వివిధ రకాల పూలు తీసుకొచ్చి…స్వామి వారి బాలాలయంలో అంతరింగకంగా నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఏకాదశి రోజున యాదాద్రిలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ కార్యక్రమంలో…దేవస్థాన ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Read More : Amazon Festival Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్లకు బెనిఫిట్స్! 

మరోవైపు యాదాద్రికి సంబంధించిన పునర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొండపై ఆటోస్టాండ్ వద్ద భక్తిభావం ఉట్టిపడేలా స్వాగత తోరణాన్ని నిర్మిస్తున్నారు. రెండు ఘాట్ రోడ్లు కలిసే ప్రాంతంలో దీనిని నిర్మిస్తున్నారు. 40 ఫీట్ల ఎత్తు, 20 ఫీట్ల వెడల్పుతో వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా దీనిని నిర్మిస్తున్నారు. ఆర్చ్ పై దేవతమూర్తులను పొందుపరిచేందుకు సాలహారాలు రూపొందించనున్నారు. సింహాకృత్తులు, ఐరావతాలు, గోపురాలు ఉండనున్నాయి. శంఖు, చక్ర, తిరునామాలు అద్భుతమైన కిటికీలు, కాకతీయ తోరణాలు, దేవతామూర్తులను పొందుపరిచేలా నిర్మిస్తున్నారు. అంతేగాకుండా..సాలహారంలో స్వామి, అమ్మవార్ల ప్రతిమలను అమర్చనున్నారు.