Raghu Rama Krishna Raju : చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి.. వైసీపీ ఎంపీ ట్వీట్..
చిరంజీవి వాల్తేరు వీరయ్య జనవరి 13న, బాలకృష్ణ వీరసింహా రెడ్డి జనవరి 12న రిలీజ్ కానున్నాయి. అయితే ఈ సినిమాల రిలీజ్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ట్వీట్ చేశారు...........

Raghu Rama Krishna Raju sensational comments on chiranjeevi and balakrishna movies
Raghu Rama Krishna Raju : ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు తమ సినిమాలతో రానున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్యతో, బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలోకి రానున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఫుల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అవుతాయి అని అభిమానులు గట్టిగా ఫిక్స్ అయ్యారు.
చిరంజీవి వాల్తేరు వీరయ్య జనవరి 13న, బాలకృష్ణ వీరసింహా రెడ్డి జనవరి 12న రిలీజ్ కానున్నాయి. అయితే ఈ సినిమాల రిలీజ్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ట్వీట్ చేశారు. చిరంజీవిని జనసేన కింద చూడటం, బాలకృష్ణ ఎలాగో టీడీపీ కావడంతో ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి వీరిద్దరూ ప్రస్తుతం ప్రత్యర్థులే. ఇప్పటికే బాలకృష్ణ, పవన్ పై వైసీపీ నాయకులూ విపరీతంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Dhanush : ధనుష్ మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పాడా??
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు.. సంక్రాంతికి విడుదల కానున్న #VeeraSimhaReddy #WaltairVeerayya రెండు చిత్రాలు హిట్ అవ్వాలి. మా పార్టీకి చెందినవారు వేరే పేర్లతో తప్పుడు రివ్యూలు రాస్తారు. ఒకరి ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ మరొకరిపై విమర్శలు గుప్పిస్తారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలి అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇప్పటికే దిల్ రాజు వల్ల చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఒక్కటై థియేటర్స్ కోసం పోరాడుతున్నారు. తాజాగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన ఈ ట్వీట్ తో మరోసారి చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఒక్కటై నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సంక్రాంతికి విడుదల కానున్న #VeeraSimhaReddy #WaltairVeerayya రెండు చిత్రాలు హిట్ అవ్వాలి. మా పార్టీకి చెందినవారు వేరే పేర్లతో తప్పుడు రివ్యూలు రాస్తారు. ఒకరి ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ మరొకరిపై విమర్శలు గుప్పిస్తారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలి.
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) January 8, 2023