Rahul Ramakrishna : తండ్రి అయిన స్టార్ కామెడియన్.. పెళ్లి అయిందా అనేది సస్పెన్స్!

టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ.. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు. కాగా గత ఏడాది మే నెలలో తన పెళ్లి వార్త చెప్పాడు ఈ స్టార్ కామెడియన్. సడన్ గా గత ఏడాది నవంబర్ లో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. అసలు రాహుల్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అంటూ సందేహాలు వ్యక్తం చేశారు అభిమానులు. తాజాగా రాహుల్..

Rahul Ramakrishna : తండ్రి అయిన స్టార్ కామెడియన్.. పెళ్లి అయిందా అనేది సస్పెన్స్!

Rahul Ramakrishna became the father of a child

Rahul Ramakrishna : టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ.. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నాడు. కాగా గత ఏడాది మే నెలలో తన పెళ్లి వార్త చెప్పాడు ఈ స్టార్ కామెడియన్. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తూ.. తను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశాడు. ఆ తరువాత మళ్ళీ పెళ్లి వార్త గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు రాహుల్. సడన్ గా గత ఏడాది నవంబర్ లో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు.

Rahul Ramakrishna: తండ్రి కాబోతున్న టాలీవుడ్ స్టార్ కమెడియన్.. అసలు పెళ్లి ఎప్పుడైంది అంటున్న నెటిజెన్లు..

అసలు రాహుల్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అంటూ సందేహాలు వ్యక్తం చేశారు అభిమానులు. అయితే రాహుల్ రహస్యంగా, సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియదు. తాజాగా రాహుల్.. తనకి మగ బిడ్డ పుట్టినట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. దీంతో రాహుల్ కి ఫ్యాన్స్, సెలెబ్రెటీస్ అభినందనలు తెలియజేస్తున్నారు.

కాగా రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం లీడ్ క్యారెక్టర్ లో నటిస్తున్న చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. నరేష్, గంగవ్వ, సురభి ప్రభావతి, చేవెళ్ల రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ నారెడ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న సినిమాలోని ‘దావత్’ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఆహా స్టూడియో సంస్థలు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తుంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిచనున్నారు మేకర్స్.