రాజమౌళి, మహేశ్ బాబు కాంబోపై బిగ్ అప్డేట్!
ఈ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్‌తో పీరియాడిక్ డ్రామాగా..

Rajamouli Mahesh Babu SSMB 29 Movie Update Rumours Go Viral
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, సినిమాలో తన లుక్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడు రాజమౌళి. ఐతే గతంలో బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి పిరియాడికల్ డ్రామాలు అందించిన రాజమౌళి… మహేశ్‌బాబు కోసం అటువంటి కథనే రెడీ చేసినట్లు తాజాగా బయటపడింది. దీంతో ఈ ఇద్దరి కాంబోపై మరింత క్రేజ్ పెరిగింది.
హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమా కథ గురించి ఓ సాలిడ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్‌తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందని టాలీవుడ్ టాక్. సినిమాకు తగ్గట్లుగా నటీనటులని వందల ఏళ్ల నాటి గిరిజన తెగ లుక్స్ తెచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు లెజండరీ డైరెక్టర్ రాజమౌళి.
భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీని నిర్మాత కె.ఎల్. నారాయణ రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను బుక్ చేసినట్లు చెబుతున్నారు. మహేశ్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని ఫిలింనగర్ న్యూస్.
రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. మొత్తానికి 225 ఏళ్ల క్రితం నాటి స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి వరల్డ్ వైడ్‌గా టాలీవుడ్ పేరు మారుమోగనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 18వ శతాబ్దం క్రితం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టనున్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్న రాజమౌళి విజయవంతం అవ్వాలని అంతా కోరుకుంటున్నారు.
జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన అమ్మాయిపై భార్య అయేషా సంచలన కామెంట్స్