Rajamouli : రాజమౌళి పొగిడిన ఆ కుర్రాడు ఎవరు? ఇండియాకు స్వర్ణపతాకం తీసుకొచ్చిన 19 ఏళ్ళ కుర్రాడు..

ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? రాజమౌళి అతని గురించి ఎందుకు అంతలా పొగుడుతూ ట్వీట్ చేశారు.

Rajamouli : రాజమౌళి పొగిడిన ఆ కుర్రాడు ఎవరు? ఇండియాకు స్వర్ణపతాకం తీసుకొచ్చిన 19 ఏళ్ళ కుర్రాడు..

Rajamouli appreciated and special tweet on Prathamesh Samadhan Javkar

Updated On : May 22, 2023 / 10:24 AM IST

Prathamesh Samadhan Javkar : తాజాగా రాజమౌళి(Rajamouli) చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అంతా ఆ ట్వీట్(Tweet) గురించి, అందులో ఉన్న వ్యక్తి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? రాజమౌళి అతని గురించి ఎందుకు అంతలా పొగుడుతూ ట్వీట్ చేశారు.

చైనా శాంఘైలో ఆర్చరీ ప్రపంచకప్ జరిగింది. ఈ ప్రపంచ కప్ లో మన ఇండియాకు చెందిన ప్రథమేశ్‌ సమాధాన్ జావ్కర్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి స్వర్ణపతాకం సాధించాడు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడుసార్లు ప్రపంచ విజేత అయిన నెదర్లాండ్స్ కు చెందిన మైక్ స్కోసర్ ను ఓడించి ప్రథమేశ్‌ సమాధాన్ జావ్కర్‌ గోల్డ్ గెలుపొందాడు.

RGV : ది కేరళ స్టోరీ వర్సెస్ బాలీవుడ్.. ఆర్జీవీ వరుస ట్వీట్స్..

దీంతో ఒక్కసారిగా ప్రథమేశ్‌ సమాధాన్ జావ్కర్‌ దేశమంతా పాపులర్ అయ్యాడు. పలువురు ప్రముఖులు అతన్ని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి కూడా ప్రథమేశ్‌ సమాధాన్ జావ్కర్‌ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. తన ట్వీట్ లో.. ప్రథమేశ్ సూపర్. భారతదేశంలో ఆర్చరీ మరింత అభివృద్ధి చెందడం చూసి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అద్భుతమైన ట్యాలెంట్ వెలుగులోకి వచ్చింది. షాంఘై ప్రపంచకప్ లో స్వర్ణ పథకం గెలిచినందుకు ప్రథమేశ్‌ కు నా అభినందనలు. అతను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. రాజమౌళి ఈ 19 ఏళ్ళ కుర్రాడిని అభినందిస్తూ ట్వీట్ చేయడంతో అతను మరింత పాపులర్ అవుతున్నాడు. మరింతమంది నెటిజన్లు అతన్ని అభినందిస్తున్నారు.