Rajamouli : హాలీవుడ్ లో మరో గుర్తింపు.. అమెరికా బియాండ్ ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి సినిమాల ప్రదర్శన..
హాలీవుడ్ లో జరిగే పెద్ద సినీ ఫెస్ట్ లలో ఒకటైన ఈ బియాండ్ ఫెస్ట్ కి భారీ సంఖ్యలో ఆడియెన్స్ వస్తారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనున్న ఈ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఫెస్ట్ నిర్వాహకులు ఓ పోస్టర్ ని............

Rajamouli films screening at US Holywood Beyond Film fest
Rajamouli : బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాలతోనే రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల వచ్చిన RRR సినిమాతో రాజమౌళి ప్రపంచంలోనే గ్రేట్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని సినిమా పరిశ్రమ వ్యక్తులు, టెక్నీషియన్స్, ప్రేక్షకులు RRR సినిమాని ఎంతగానో అభినందించారు. రాజమౌళిని తమ పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు.
ఇప్పటికే RRR సినిమా సక్సెస్ తో, దానికి వచ్చిన కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా మరోసారి తెలుగు సినిమాకి గుర్తింపు తెచ్చారు రాజమౌళి. ఇక ఈ సినిమాతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు గుర్తింపులు పొందిన రాజమౌళి తాజాగా మరో అరుదైన ఘనతని అందుకుంటున్నారు. యూఎస్ లో జరిగే ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలని ప్రదర్శించనున్నారు.
హాలీవుడ్ లో జరిగే పెద్ద సినీ ఫెస్ట్ లలో ఒకటైన ఈ బియాండ్ ఫెస్ట్ కి భారీ సంఖ్యలో ఆడియెన్స్ వస్తారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరగనున్న ఈ ఫెస్ట్ లో రాజమౌళి సినిమాలని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఫెస్ట్ నిర్వాహకులు ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రాజమౌళి అనే పేరులో ఆయన సినిమాల పోస్టర్స్ వచ్చేలా డిజైన్ చేసి టాలీవుడ్ టు హాలీవుడ్ అని రాశారు. ఇక దీని గురించి ప్రత్యేకంగా ట్వీట్ కూడా చేశారు ఆ షో నిర్వాహకులు.
ఈ ఫెస్ట్ లో ఈ సెప్టెంబర్ 30న “RRR” సినిమా, అక్టోబర్ 1న “ఈగ”, “బాహుబలి పార్ట్ 1&2”, అక్టోబర్ 21న “మగధీర”, 23న “మర్యాద రామన్న” సినిమాలు కూడా ప్రదర్శించనున్నారు. రాజమౌళి కూడా ఈ ఫెస్ట్ కి అతిధిగా వెళ్లనున్నట్టు సమాచారం. ఇందులో రాజమౌళిని సన్మానించనున్నారు. దీంతో రాజమౌళి అభిమానులు, టాలీవుడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫెస్ట్ తో రాజమౌళి మరో ఘనత సాధించారు.
FROM TOLLYWOOD TO HOLLYWOOD: The Spectacle & Majesty of S.S. Rajamouli
9.30 @RRRMovie IMAX Chinese
10.1 EEGA, BAAHUBALI 1+2 Aero
10.2 CITY LIGHTS LF3@ssrajamouli @ all showsTix tmrrw 10AM https://t.co/y5eot81mUn@am_cinematheque @IMAX @iffla @VarianceFilms @PotentateFilms pic.twitter.com/CFApVX4Rzv
— Beyond Fest (@BeyondFest) September 7, 2022