Rajamouli : నా దేవుడిని కలిశాను.. రాజమౌళి!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచడం మాత్రమే కాదు, ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ఇక ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో 'ఆర్ఆర్ఆర్' అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్ కోసం అమెరికాలో RRR ని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి తన ఇన్స్పిరేషన్, తన రోల్ మోడల్ ని కలుసుకున్నాడు.

Rajamouli : నా దేవుడిని కలిశాను.. రాజమౌళి!

Rajamouli

Updated On : January 14, 2023 / 11:22 AM IST

Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచడం మాత్రమే కాదు, ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. బాహుబలితో ఇండియన్ మూవీలు కూడా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాదంటూ నిరూపించాడు. బాహుబలి చిత్రాలతో ప్రపంచ సినీ సాంకేతిక నిపుణలను మన వైపు చూసేలా చేసిన రాజమౌళి.. ‘RRR’ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ని ఇండియన్ సినిమాలు చూసేలా చేశాడు. కేవలం ఆదరణ పొందడమే కాదు, అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకునేలా భారతీయ చిత్రాన్ని నిలిపాడు.

Rajamouli : RRR విజయం నమ్మలేనిది.. ఫారినర్స్ RRRని ఎందుకు అంత ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను..

ఇక ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ పిక్చర్ క్యాటగిరీలో ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ రేస్ లో నిలవగా.. ‘నాటు నాటు’ బెస్ట్ సాంగ్ గా అవార్డుని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్స్ కోసం అమెరికాలో RRR ని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి తన ఇన్స్పిరేషన్, తన రోల్ మోడల్ ని కలుసుకున్నాడు. ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ వంటి సినిమాలను తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ ‘స్టీవెన్ స్పీల్‌బెర్గ్’ ని రాజమౌళి కలుసుకున్నాడు. స్టీవెన్ ని చూసి ఎమోషనల్ అయిన ఫోటోని షేర్ చేస్తూ.. ‘నా దేవుడిని కలిశాను’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. ‘ఇద్దరు లెజెండ్స్ ఒక ఫ్రేమ్‌లో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం RRR చిత్రం ఆస్కార్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంది. ఈ నెల 12 నుంచి 17 వరకు జరిగే ఓటింగ్ లో.. ఎక్కువ ఓట్లు సాధిస్తే నామినేషన్స్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇస్తుంది.