Rajamouli : రాజమౌళి నెక్స్ట్ సినిమా.. ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఇండియన్ సినిమాపై బయోపిక్..

RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో భారీ సినిమా తీయబోతున్నట్టు ఇప్పటికే అందరికి తెలుసు. కానీ ఈ సినిమా కంటే ముందు మరో భారీ సినిమాని నిర్మిస్తున్నారు రాజమౌళి.

Rajamouli : రాజమౌళి నెక్స్ట్ సినిమా.. ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఇండియన్ సినిమాపై బయోపిక్..

Rajamouli next movie as Producer Titled as Made In India Directed by Nitin Kakkar

Updated On : September 19, 2023 / 10:33 AM IST

Rajamouli Movie : తెలుగు సినిమాని బాహుబలితో నేషనల్ లెవల్ కి, RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి. రాజమౌళి నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడొస్తుందా అని ప్రతి సినిమా తర్వాత అంతా ఎదురుచూస్తూనే ఉంటారు. RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో భారీ సినిమా తీయబోతున్నట్టు ఇప్పటికే అందరికి తెలుసు. కానీ ఈ సినిమా కంటే ముందు మరో భారీ సినిమాని నిర్మిస్తున్నారు రాజమౌళి.

ఇప్పటివరకు సినీ పరిశ్రమలో చాలా బయోపిక్స్ వచ్చాయి. కానీ సినిమా పరిశ్రమ మీదే బయోపిక్ రాబోతుంది ఇప్పుడు. నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఇండియా సినిమా ఎలా పుట్టింది, ఎలా ఎదిగింది, ఎవరు ఇండియన్ సినిమాని మొదలుపెట్టారు అనే కథాంశంతో ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే సినిమాని వరుణ్ గుప్తా, రాజమౌళి తనయుడు SS కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని రాజమౌళి పర్యవేక్షణలో నిర్మిస్తూ ఆయన ప్రజెంట్స్ లో రిలీజ్ చేయనున్నారు.

Rajinikanth : జైలర్ సినిమా నాకు ఎబోవ్ యావరేజ్ అనిపించింది.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి నిర్మాతగా మారి సినిమా తీస్తున్నారంటే కచ్చితంగా మంచి ఆసక్తి గల కథే అయి ఉంటుందని భావిస్తూ సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనౌన్సమెంట్ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. బయోపిక్స్ తీయడం చాలా కష్టం. ఇక ఫాదర్ ఆఫ ఇండియన్ సినిమా బయోపిక్ తీయాలంటే మరింత కష్టం. ఈ సినిమాని నాకు నేరేషన్ చేసినప్పుడు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. అందుకే చాలా గర్వంతో ఈ మేడ్ ఇన్ ఇండియా సినిమాని ప్రజెంట్ చేస్తున్నాను అని రాజమౌళి ట్వీట్ చేశారు.