కల్కి’ టీజర్ రిలీజ్!
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’.

సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’.
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’. గరుడవేగ’ హిట్ తరువాత కొత్తగా అనిపించే కథ కోసం రాజశేఖర్ కొంతకాలం వెయిట్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్ వర్మ ఒక కథ వినిపించారు స్టోరి నచ్చేసిందంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాకి ‘కల్కి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకుని సెట్స్ పైకి వెళ్లారు. ఈ సినిమాలో రాజశేఖర్ తనకి బాగా అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రతో కనిపించనున్నాడు.
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్
ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్ర యూనిట్. అందులో భాగం ఈ రోజు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకి సినిమాఫై ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి మీరు ఈ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ సినిమా రాజశేఖర్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
Read Also : సమంత పిలుపు : ఆ టీడీపీ అభ్యర్థిని గెలిపించండి