Rajinikanth : జై భీమ్ దర్శకుడితో రజినీకాంత్ కొత్త సినిమా అనౌన్స్..
రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బీస్ట్ ఫేమ్ నెల్సన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా రజిని తన 170 సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్..

Rajinikanth announces new movie with director of Jai Bheem under lyca productions
Rajinikanth : రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బీస్ట్ ఫేమ్ నెల్సన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా రజిని తన 170 సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో రజినీకాంత్ ఇటీవల రెండు సినిమాలకు కమిట్ అయ్యినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక చిత్రాన్ని లైకా నిర్మాణంలో తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు రజినికాంత్ తో తమ రెండో ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేశారు లైకా నిర్మాతలు.
Rajinikanth : మొన్న అమితాబ్, నేడు రజిని.. కోర్ట్లో పిటిషన్!
ఈరోజు లైకా చైర్మన్ సుబాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని టిజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ దర్శకుడు రీసెంట్ గా తెరకెక్కించిన ‘జై భీమ్’ మూవీ ఓటిటి లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద విజయం సాధించో అందరికి తెలుసు. ఇక ఇప్పుడు తన తదుపరి సినిమా రజినీకాంత్ తో అనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై.. అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా కూడా ఒక సోషల్ ఎలిమెంట్ తోనే తెరకెక్కించబోతున్నట్లు తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుద్ ని ఎంపిక చేశారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు తెలియజేశారు. అలాగే 2024 లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. కాగా రజినీకాంత్ కి రోబో సినిమా తరువాత సరైన హిట్ లేదు. మధ్యలో 2.0 వచ్చినా, అనుకున్నంత స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయింది. దీంతో రజిని అభిమానులు తలైవా గ్రాండ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి అభిమానుల కోరికను ఈ సినిమాలు నెరవేరుస్తాయా? లేదా? చూడాలి.
We are feeling honoured to announce our next association with “Superstar” @rajinikanth ? for #Thalaivar170 ?
Directed by critically acclaimed @tjgnan ? Music by the sensational “Rockstar” @anirudhofficial ?
? @gkmtamilkumaran
? @LycaProductions #Subaskaran#தலைவர்170 ? pic.twitter.com/DYg3aSeAi5— Lyca Productions (@LycaProductions) March 2, 2023