Rajinikanth : విజయ్ ‘బీస్ట్’ మూవీ హిట్ అయ్యిందా..? ప్లాప్ అయ్యిందా..? రజినీకాంత్ కామెంట్స్..

విజయ్ బీస్ట్ మూవీ హిట్ అయ్యిందో, ప్లాప్ అయ్యిందో అన్న విషయం చెప్పిన రజినీకాంత్.

Rajinikanth : విజయ్ ‘బీస్ట్’ మూవీ హిట్ అయ్యిందా..? ప్లాప్ అయ్యిందా..? రజినీకాంత్ కామెంట్స్..

Rajinikanth comments on Vijay beast movie talk in jailer promotions

Rajinikanth – Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్ లో 2022 లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా బీస్ట్ (Beast). ఈ సినిమాకంటే ముందు నెల్సన్ శివకార్తికేయన్ తో ‘డాక్టర్’ అనే యాక్షన్ కామెడీ సినిమాని తెరకెక్కించి సూపర్ హిట్టు అందుకున్నాడు. దీంతో రిలీజ్ కి ముందు బీస్ట్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే మూవీ మాత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని చోట్ల డివైడ్ టాక్, మరికొన్ని చోట్ల ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.

Nitin Desai : తండ్రి మరణం పై నితిన్‌ కుమార్తె వ్యాఖ్యలు.. మోసం చేసి డబ్బులు..

ఇక ఈ మూవీ తరువాత నెల్సన్ తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘జైలర్’ (Jailer) అని అనౌన్స్ చేశాడు. అయితే ఈ అనౌన్స్‌మెంట్ తరువాత రజినీ చాలామంది కాల్స్ చేసి నెల్సన్ తో సినిమా చేయవద్దని చెప్పారట. కారణం బీస్ట్ సినిమా సరిగ్గా ఆడలేదు అని చెప్పుకొచ్చారట. ఇక ఈ విషయాన్ని రజినీ.. బీస్ట్, ఇప్పుడు జైలర్ మూవీ నిర్మస్తున్న ప్రొడ్యూసర్స్ ని అడిగాడట. దానికి వారు సమాధానం ఇస్తూ.. రివ్యూస్ చాలా బ్యాడ్ గా వచ్చినప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం ఎటువంటి లాస్ జరగలేదని చెప్పుకొచ్చారట. ఈ విషయాన్ని రజినీ ఇటీవల తెలియజేశాడు.

Devara : ఆక్వామ్యాన్ గా ఎన్టీఆర్.. ‘దేవర’లో షార్క్‌తో మాస్ ఫైట్ సీక్వెన్స్..?

కాగా బీస్ట్ మూవీ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 250 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ మూవీ స్టోరీ పరంగా ప్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం హిట్ అయ్యింది. మరి ఇప్పుడు జైలర్ తో నెల్సన్.. రజినీకాంత్ నమ్మకాన్ని నిలబెడతాడో లేదో చూడాలి. జైలర్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్, నాగబాబు, సునీల్, జాకీ ష్రాఫ్, త‌మ‌న్నా, రమ్య కృష్ణ.. ఇలా చాలామంది స్టార్స్ కనిపించబోతున్నారు. ఆగష్టు 10న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.