అభిమానికి ‘తలైవా’ స్వీట్ వార్నింగ్
చెన్నై ఎయిర్ పోర్ట్ దగ్గరినుండి ఓ అభిమాని బైక్‌పై రజినీ కార్‌ను వెంబడిస్తూ.. ఇంటి వరకూ వెళ్లాడు.. ఇది గమనించిన రజినీ.. అతనికి స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఫోటో దిగి పంపారు..

చెన్నై ఎయిర్ పోర్ట్ దగ్గరినుండి ఓ అభిమాని బైక్‌పై రజినీ కార్‌ను వెంబడిస్తూ.. ఇంటి వరకూ వెళ్లాడు.. ఇది గమనించిన రజినీ.. అతనికి స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఫోటో దిగి పంపారు..
సినిమా స్టార్స్ పబ్లిక్‌లోకి వస్తే మామూలు హంగామా ఉండదు.. అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో గుమిగూడుతుంటారు. వారిని కంట్రోల్ చేయడానికి బౌన్సర్లు, పోలీసుల ప్రొటెక్షన్ తప్పనిసరి.. రీసెంట్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఇలాంటి సంఘటన ఒకటి ఎదురైంది. ఇటీవల హిమాలయాలకు వెళ్లిన రజినీ గత రాత్రి తిరిగి చెన్నై చేరుకున్నారు.
రజినీ వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు చెన్నై ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. రజినీ రాకతో అందరూ చుట్టు ముట్టారు.. ‘తలైవా’తో ఫోటోల కోసం ఎగబడ్డారు.. కొంతమందికి ఫోటోలిచ్చి రజినీ ఇంటికి బయలుదేరారు. అయితే ఎయిర్ పోర్ట్ దగ్గరినుండి ఓ అభిమాని బైక్‌పై రజినీ కార్‌ను వెంబడిస్తూ.. ఇంటి వరకూ వెళ్లాడు. ఇది గమనించిన రజినీ.. వాచ్‌మెన్‌కి చెప్పి అతగాడిని ఇంట్లోకి పిలిపించారు..
Read Also : శివ కార్తికేయన్ ‘హీరో’ సెకండ్ లుక్
‘అర్థరాత్రి వేళ బైక్‌పై జర్నీ సేఫ్ కాదు.. ఎయిర్ పోర్ట్ నుండి చూస్తున్నాను.. స్పీడ్‌గా బైక్ డ్రైవ్ చేస్తూ ఇంటి వరకు ఛేజ్ చేశావ్.. ఇంకెప్పుడూ ఇలా చెయ్యొద్దు’ అని స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఫోటో దిగి పంపారు.. #WelcomeBackThalaiva హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.. రజినీ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మురుగదాస్ దర్శకత్వంలో రజినీ నటించిన ‘దర్బార్’ 2020 సంక్రాంతికి విడుదల కానుంది.
#Thalaivar #Verithanam https://t.co/DlRTgTLmAH
— Ramesh Ramachandran (@itsmeRameshR5) October 19, 2019