Pushpa 2 : పుష్ప‌2 నిర్మాత‌ల‌కు వార్నింగ్‌.. వెంట‌నే ఆ పేరు తీసేయండి..

తాజాగా ఈ చిత్రానికి ఓ స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.

Pushpa 2 : పుష్ప‌2 నిర్మాత‌ల‌కు వార్నింగ్‌.. వెంట‌నే ఆ పేరు తీసేయండి..

Rajput leader threatens Pushpa 2 makers over use of Shekhawat

Updated On : December 9, 2024 / 5:42 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మూవీ పుష్ప 2. డిసెంబ‌ర్ 5న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే ఆరు వంద‌ల కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రానికి ఓ స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఈ చిత్రంలో ఫ‌హ‌ద్ ఫాజిల్ పోషించిన పాత్ర పేరును తొల‌గించ‌క‌పోతే నిర్మాత‌ల‌ను ఇంటికి వ‌చ్చి కొడ‌తాం అని క‌ర్ణిసేన హెచ్చ‌రించింది.

షెకావ‌త్ పాత్ర క్ష‌త్రియ స‌మాజాన్ని అవ‌మానించేలా ఉంద‌ని ఆరోపించారు రాజ్‌పుత్ సంఘం నాయ‌కుడు రాజ్ షెకావ‌త్‌. ఈ మేరకు సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఓ వీడియోను విడుద‌ల చేశారు. పుష్ప 2 చిత్రంలో షెకావత్ పాత్ర నెగిటివ్ గా ఉందన్నారు. అది క్షత్రియులను అవమానించేలా ఉంద‌న్నారు. ఈ సినిమా నిర్మాత‌ల‌ను కొట్టేందుకు క‌ర్ణి సేన సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్యానించారు.

Shah Rukh Khan-Aryan Khan : తండ్రీ కొడుకుల విస్కీ బిజినెస్.. వరల్డ్ లోనే బెస్ట్ బ్రాండ్ గా.. రేటెంతో తెలుసా..

చిత్రంలో షెకావ‌త్ అనే ప‌దాన్ని ప‌దే ప‌దే అవ‌మానించ‌డం జ‌రిగింద‌ని, అది క్ష‌త్రియ స‌మాజాన్ని అవ‌మానించ‌డ‌మే అవుతోందిన క‌ర్ణిసేన ఆరోప‌ణ చేస్తోంది. ఈ చిత్రం నుంచి ఆ ప‌దాన్ని వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తోంది. “ఈ సినిమా క్షత్రియులను ఘోరంగా అవమానించింది. ‘షెకావత్’ కమ్యూనిటీని హీనంగా ప్రదర్శించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో అవమానించిందని అని.” రాజ్ షెకావ‌త్ అన్నారు.

చిత్ర నిర్మాత‌లు.. సినిమా నుంచి షెకావ‌త్ ప‌దాన్ని వెంట‌నే తీసివేయాలి, లేదంటే వాళ్ల‌ను ఇంటికి వ‌చ్చి మ‌రీ క‌ర్ణి సేన కొడుతుంది, అంతేకాదు.. అవ‌స‌ర‌మైతే ఎంత‌దూర‌మైనా వెళ‌తాం అని హెచ్చ‌రించారు. మ‌రి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.

Movie Shooting Updates : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? మిరాయ్‌, విశ్వంభ‌ర‌ల‌ సంగ‌తేంటి?

కాగా.. పుష్ప‌2 మూవీలో ఫ‌హ‌ద్ పాజిల్ ‘బ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్’ పాత్ర‌లో క‌నిపించారు.

 

View this post on Instagram

 

A post shared by Dr Raj Shekhawat (@iamrajshekhawat)