Movie Shooting Updates : ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది..? మిరాయ్, విశ్వంభరల సంగతేంటి?
మన హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు

Vishwambhara Fauji Mirai And So Many Movies Shooting Updates
Movie Shooting Updates : మన హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి, ప్రభాస్, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో ఓ సారి తెలుసుకుందాం.
* మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ విశ్వంభర. ఈ చిత్ర షూటింగ్ కోకాపేటలో జరుగుతుంది.
* ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతుంది.
* ప్రభాస్ జాను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.
* నాగార్జున ధనుష్ శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కుతున్న కుబేర మూవీ షూటింగ్ నానక్ రామ్ గుడా రామానాయుడు స్టూడియో లో జరుగుతోంది.
* రవితేజ భాను బొగ్గవరపు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర పల్లి లో జరుగుతుంది.
Sonusood : ఫతే సినిమా టీజర్ వచ్చేసింది.. సోనూసూద్ అదరగొట్టాడుగా..
* భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా స్వయంభూ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.
* తేజ సజ్జ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నటిస్తున్న మిరాయ్ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.