Roja – Pushpa 2 : ‘పుష్ప 2’ సినిమాపై రోజా రివ్యూ.. మా చిత్తూరు యాస అంటూ చాలా పెద్దగానే రాసుకొచ్చిందే..

పుష్ప 2 సినిమాపై అభిమానులు, ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా సినిమా చూసి రివ్యూ చెప్తున్నారు.

Roja – Pushpa 2 : ‘పుష్ప 2’ సినిమాపై రోజా రివ్యూ.. మా చిత్తూరు యాస అంటూ చాలా పెద్దగానే రాసుకొచ్చిందే..

Roja Review on Allu Arjun Pushpa 2 Movie Goes Viral

Updated On : December 9, 2024 / 2:30 PM IST

Roja – Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇప్పటికే మూడు రోజుల్లో 620 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొడుతుంది. నార్త్ లో అయితే అన్ని హౌస్ ఫుల్ షోలతో థియేటర్స్ వద్ద క్యూలైన్స్ ఉన్నాయి. ఇక పుష్ప 2 సినిమాపై అభిమానులు, ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా సినిమా చూసి రివ్యూ చెప్తున్నారు.

Also Read : Sukumar : ‘సుక్కు స్వాగ్’.. సుకుమార్ పై రాప్ సాంగ్.. భలేఉందే..

తాజాగా నటి, మాజీ మంత్రి రోజా పుష్ప 2 సినిమా చూసి తన రివ్యూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రోజా పుష్ప 2 సినిమా గురించి.. వేటూరి గారు ఒక ఇంటర్వ్యూ లో అంటారు ‘అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయి`అని. లెక్కల మాస్టారు సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పైన చిందులేయించారు, మీతో ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ ని ఛాలెంజ్ గా తీసుకుని ఒక్క `భాష – యాస`కే కాదు వేషానికి కూడ 100% న్యాయం చేయించారు నటీనటులతో. మా చిత్తూరు యాస లో చెప్పాలంటే ‘ఊరు ఊరంతా… రేయ్ మచ్చా ఎవుడ్రా ఈడు’ అని మాట్లాడుకునేలా చేశారు. బాక్సాఫీస్ బద్ధలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. మీరు మూడు గంటల ఇరవై నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్‌ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరో చీర కట్టుకుని, పసుపు రాసుకుని, గంధం పూసుకుని, నిమ్మకాయల దండ మెడలో వేసుకుని, జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డాన్స్ చేసిన సీన్లు స్క్రీన్ పై‌ అద్భుతంగా చేసి చూపించారు. రష్మిక కూడా సూపర్ అని రాసుకొచ్చింది. దీంతో రోజా రివ్యూ వైరల్ గా మారింది.