Operation Raavan : ‘ఆపరేషన్ రావణ్’ అంటున్న రక్షిత్.. రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా 'ఆపరేషన్ రావణ్' సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు.

Operation Raavan : ‘ఆపరేషన్ రావణ్’ అంటున్న రక్షిత్.. రిలీజ్ ఎప్పుడంటే..

Rakshit Atluri Operation Raavan Movie Release Date Announced

Operation Raavan : పలాస, నరకాసుర లాంటి సినిమాలతో మెప్పించిన రక్షిత్ అట్లూరి త్వరలో ఆపరేషన్ రావణ్ సినిమాతో రాబోతున్నాడు. రక్షిత్ అట్లూరి, సంగీర్తన జంటగా సుధాస్ మీడియా బ్యానర్ పై ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో వెంకట సత్య దర్శకత్వంలో ఈ ఆపరేషన్ రావణ్ తెరకెక్కుతుంది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, రఘు కుంచె ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

https://10tv.in/telugu-news/movies/rakshit-atluri-operation-raavan-movie-release-date-announced-840615.html

Also Read : Jani Master : మెగా మూమెంట్.. డ్యాన్స్ మాస్టర్ జానీ బర్త్ డేని సెలబ్రేట్ చేసిన చిరు, చరణ్..

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తిచేస్తుంది. ఆల్రెడీ ఆపరేషన్ రావణ్ సినిమా నుంచి టీజర్, సాంగ్ కూడా గతంలో రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. ఆపరేషన్ రావణ సినిమా ఆగస్టు 2న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. సైకో స్టోరీ అని, మీ ఆలోచనలే మీకు శత్రువులు అని సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.