Boyapati Sreenu: వారియర్ దెబ్బ బోయపాటికి పడిందా..?

యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ‘ది వారియర్’ సినిమా ఫ్లాప్ కావడంతో, బోయపాటి స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాల్సిందిగా రామ్ కోరాడట.

Boyapati Sreenu: వారియర్ దెబ్బ బోయపాటికి పడిందా..?

Ram Asks Changes In Boyapati Sreenu Script Due To The Warrior Mistakes

Updated On : July 23, 2022 / 5:21 PM IST

Boyapati Sreenu: మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ప్రస్తుతం యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకు, ఇప్పుడు వారియర్ దెబ్బ పడుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘ది వారియర్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది.

BoyapatiRAPO: తమ సినిమాకు రెమ్యునరేషన్ వదులుకున్న బోయపాటి-రామ్‌లు

దీంతో అసలు ‘ది వారియర్’ సినిమాలో ఏం తప్పులు దొర్లాయా అని రామ్ సమీక్షిస్తున్నాడట. ఈ క్రమంలోనే బోయపాటి చెప్పిన స్క్రిప్టులో పలు మార్పులు చేయాల్సిందిగా రామ్ కోరాడట. అయితే బోయపాటి స్క్రిప్టులో రామ్ చెప్పిన మార్పులు చాలా ఉండటంతో బోయపాటి పరిస్థితి అయోమయంగా మారిందట. తాను రాసుకున్న స్క్రిప్టు పక్కా కమర్షియల్ అంశాలతో ఉందని.. ఈ స్క్రిప్టును ఉన్నవిధంగా తెరకెక్కిస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆయన భావిస్తున్నాడట.

Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ‘ది వారియర్’ సినిమాలో కథనం బాగున్నా, దాన్ని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడని సినీ విమర్శకులు తెలిపారు. అయితే బోయపాటి విషయంలో అలాంటి అనుమానాలు అవసరం లేదని.. ఆయన గత చిత్రం ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ మూవీగా నిలవడంతో, ఆయన రెట్టింపు ఉత్సాహంతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడని.. అలాంటప్పుడు ‘ది వారియర్’ దెబ్బను బోయపాటిపై పడటం ఏమిటని ఆయన అభిమానులు అంటున్నారు. ఏదేమైనా రామ్ తన నెక్ట్స్ విషయంలో ఏమాత్రం తప్పులు జరగకుండా ఉండేందుకే ఇలా కథలో మార్పులు చేయాల్సిందిగా కోరుతున్నాడట.