Charan-Sukumar: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. RC 17 షూటింగ్ అప్డేట్.. ఇక మొదలెడదామా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్(Charan-Sukumar) కాంబోలో రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది.

Charan-Sukumar: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. RC 17 షూటింగ్ అప్డేట్.. ఇక మొదలెడదామా..

Director Sukumar finalized heroine for Ram charan RC 17 movie (1)

Updated On : December 30, 2025 / 12:35 PM IST

Charan-Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తున్న మూవీ పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మర్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ మరోసారి స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది.

Archana Iyer: శంబాల మూవీ సెలబ్రేషన్స్ లో అర్చన అయ్యర్ అందాలు.. క్యూట్ ఫొటోలు

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే, రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక ప్రమోషన్స్ లో పాల్గొంటాడు రామ్ చరణ్. ఆ తరువాత ఒక వన్ నెల రోజుల ఫ్యామిలీతో హాలిడే వెకేషన్ కి వెళ్తాడు. ఆ తరువాత అంటే, జులై నుంచి RC 17 సినిమా షూటింగ్ పాల్గొననున్నాడు రామ్ చరణ్. దాదాపు ఆరు నెలల సమయాన్ని సుకుమార్ సినిమా కోసం వెచ్చించనున్నాడట రామ్ చరణ్. ఈ న్యూస్ తెలియడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక గతంలో రామ్ చరణ్- సుకుమార్(Charan-Sukumar) కాంబోలో రంగస్థలం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్డ్రాప్ లో రివెంజ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఆ టైంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేది. ఆయన నటించాడు అనేకంటే చిట్టిబాబు పాత్రలో జీవించాడు అనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి అదే కాంబో రిపీట్ అవడం అనేది హాట్ టాపిక్ గా మారింది. అలాగే, సినిమాపై కూడా అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇక ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.