బతుకమ్మ వేడుకల్లో రామ్ చరణ్ డ్యాన్స్

  • Published By: sekhar ,Published On : October 27, 2020 / 01:29 PM IST
బతుకమ్మ వేడుకల్లో రామ్ చరణ్ డ్యాన్స్

Updated On : October 27, 2020 / 2:28 PM IST

Ram Charan Batukamma Dance: మెగా వర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ బతుకమ్మ వేడుకల్లో డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇంతకు ముందు చరణ్‌ అత్తవారింటికి బతుకమ్మ పండుగకు వెళ్లినప్పుడు అక్కడున్న వారితో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన చిరు..
‘‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను..’’ అంటూ ట్విట్టర్ ద్వారా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి..
https://10tv.in/rrr-ram-charan-dubbing-for-bheem/