అమ్మ జన్మదినం – చెర్రీ ఆనందం..

తన తల్లి కొణిదెల సురేఖ పుట్టినరోజుని భార్యతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన రామ్ చరణ్..

  • Published By: sekhar ,Published On : February 18, 2020 / 11:22 AM IST
అమ్మ జన్మదినం – చెర్రీ ఆనందం..

Updated On : February 18, 2020 / 11:22 AM IST

తన తల్లి కొణిదెల సురేఖ పుట్టినరోజుని భార్యతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన రామ్ చరణ్..

తన తల్లి కొణిదెల సురేఖ పుట్టినరోజుని భార్య సురేఖతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్.. సురేఖ జన్మదినోత్సవం సందర్భంగా ఆమెతో కలిసి తీసుకున్న ఫోటోలను చరణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఫిబ్రవరి 18 (మంగళవారం) పుట్టినరోజు. ఈ సందర్భంగా చెర్రీ తన భార్య ఉపాసనతో కలిసి తల్లికి జన్మదిన శుభాకంక్షలు తెలియజేశాడు. 

‘నా మొదటి ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్ యూ అమ్మా’ అంటూ తల్లితో తీసుకున్న ఫోటోను చెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. చెర్రీతో పాటు ఉపాసన కూడా సురేఖను విష్ చేశారు. ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ‘హ్యాపీ బర్త్‌ డే అత్తమ్మా.. లవ్ యూ’ అని కామెంట్ చేశారు ఉపాసన.

 

Ram Charan

రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం.. RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. 2021 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy birthday to my first love!! Love you Mom!! ??

A post shared by Ram Charan (@alwaysramcharan) on