విజయశాంతితో మెగా హీరో చిన్నప్పటి పిక్ చూశారా!
లాక్‌డౌన్ వేళ తారల ఓల్డ్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్ననాటి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. లేడీ అమితాబ్,

లాక్‌డౌన్ వేళ తారల ఓల్డ్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిన్ననాటి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. లేడీ అమితాబ్, విశ్వనట భారతి విజయశాంతి చెర్రీని ఎత్తుకుని ముద్దు చేస్తున్నారు ఈ ఫోటోలో. దీని వెనుక కథ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి, ఎ.కోదండరామి రెడ్డి కలయికలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం ‘పసివాడి ప్రాణం’ షూటింగ్ స్పాట్‌కి వచ్చిన చెర్రీని ఎత్తుకుని ఆడించారు.
ఆ సందర్భంలో తీసిన ఫోటోనే ఇది. చరణ్ ముద్దుగా భలే ఉన్నాడు. #Throwbackpicture అంటూ చరణ్ ఫ్యాన్స్ ఈ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. లాక్‌డౌన్ సమయంలో చరణ్ భార్య ఉపాసన కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తూ, రాజమౌళి విసిరిన ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్‌లో భాగంగా ఇంటి పనులు చేస్తూ వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.