Ram Charan : అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో.. నాటు నాటు పాటకి చరణ్‌తో కలిసి స్టెప్పులేసిన బాలీవుడ్ ఖాన్స్ త్రయం..

స్టేజిపై ముగ్గురు ఖాన్స్ RRR సినిమాలోని నాటు నాటు పాట హిందీ వర్షన్ కి స్టెప్పులు వేశారు. చివర్లో రామ చరణ్ ని కూడా స్టేజిపైకి పిలిచి చరణ్ తో కలిసి స్టెప్పులు వేశారు.

Ram Charan : అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో.. నాటు నాటు పాటకి చరణ్‌తో కలిసి స్టెప్పులేసిన బాలీవుడ్ ఖాన్స్ త్రయం..

Ram Charan Dance with Aamir Khan Sharh Rukh Khan Salman Khan for Naatu Naatu Song in Anant Radhika Pre Wedding Celebrations

Updated On : March 3, 2024 / 12:34 PM IST

Ram Charan : ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ జామ్ నగర్ లో గత మూడు రోజులుగా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వేడుకకి దేశ విదేశాల నుంచి ఎంతోమంది బిజినెస్, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై ఎంతోమంది అలరిస్తున్నారు. వరల్డ్ పాప్ సింగర్ రిహన్నతో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయించారు.

ఇక అంబానీ ఇంట ఏ వేడుక అయినా బాలీవుడ్(Bollywood) అంతా తరలి వెళ్తారు. అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా బాలీవుడ్ అంతా పాల్గొన్నారు. ఇక నైట్ పార్టీలో స్టేజిపై డ్యాన్సులతో, పాటలతో అందరూ అలరించారు. ఇందులో భాగంగా బాలీవుడ్ ఖాన్స్ త్రయం, స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్(Salman Khan), షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), అమీర్ ఖాన్(Aamir Khan) లు ముగ్గురూ స్టేజిపై పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

Also Read : Ram Charan – Dhoni : ఒకే ఫ్రేమ్‌లో మహేంద్ర సింగ్ ధోని, రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియో..

స్టేజిపై ముగ్గురు ఖాన్స్ RRR సినిమాలోని నాటు నాటు పాట హిందీ వర్షన్ కి స్టెప్పులు వేశారు. పర్ఫెక్ట్ గా వేయకపోయినా వాళ్ళకి వచ్చిన స్టెప్పులతో బాగానే మేనేజ్ చేశారు. చివర్లో రామ చరణ్ ని కూడా స్టేజిపైకి పిలిచి చరణ్ తో కలిసి అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టెప్పులు వేశారు. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. చరణ్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బాలీవుడ్ ముగ్గురు స్టార్ హీరోలు చరణ్ ని స్టేజిపైకి పిలిచి నాటు నాటు స్టెప్పులు వేయడంతో అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో చరణ్ బాగా వైరల్ అవుతున్నారు.