Ram Charan : థ్యాంక్యూ నాన్న.. 45 ఏళ్ళ మెగాస్టార్ సినీ ప్రస్థానం.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..

చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు 22 సెప్టెంబర్ 1978 లో రిలీజయి నేటికి 45 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Ram Charan : థ్యాంక్యూ నాన్న.. 45 ఏళ్ళ మెగాస్టార్ సినీ ప్రస్థానం.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..

Ram Charan emotional tweet on Megastar Chiranjeevi for completing 45 years in Cinema Industry

Ram Charan Tweet : ప్రాణం ఖరీదు(Pranam Khareedu) సినిమాతో మొదలైన చిరంజీవి(Chiranjeevi) ప్రస్థానం ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో మెగాస్టార్(Megastar) గా మారి నేటి వరకు కూడా సాగుతూనే ఉంది. 68 ఏళ్ళ వయసులో కూడా ఇంకా కుర్ర హీరోలతో పోటీ పడి వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నారు మెగాస్టార్. తెలుగు పరిశ్రమకు ఒక పిల్లర్ లాంటి చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ కి పెద్దన్నలా వ్యవహరిస్తున్నాడు.

చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు 22 సెప్టెంబర్ 1978 లో రిలీజయి నేటికి 45 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ పై 45 ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తయినందుకు ఎమోషనల్ గా ఓ ట్వీట్ పెట్టాడు.

Also Read : Sai Pallavi : పెళ్లి వార్తలపై సాయి పల్లవి ఫైర్.. కావాలనే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు..

రామ్ చరణ్ తన ట్వీట్ లో.. మన మెగాస్టార్ చిరంజీవి గారికి 45 ఏళ్ళు సినిమాలో మెగా జర్నీ చేసినందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రాణం ఖరీదు సినిమాతో మొదలుపెట్టి ఇప్పటికి ఇంకా ఆయన ప్రయాణం అద్భుతమైన జర్నీ. ఎన్నో లక్షల మందిని మీరు స్క్రీన్ మీద మీ నటనతో, స్క్రీన్ బయట మీ సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి నింపారు. థ్యాంక్యూ నాన్న. డిసిప్లేన్, హార్డ్ వర్క్, డెడికేషన్, ఎక్సలెన్స్.. వీటన్నిటిని మాలో నింపినందుకు అని పోస్ట్ చేసాడు చరణ్. దీంతో పాటు మెగాస్టార్ ఫోటో కూడా షేర్ చేశాడు. దీంతో రామ్ చరణ్ ట్వీట్ వైరల్ గా మారింది.