Ram Charan fans : ఉపాసన గురించి తప్పుగా మాట్లాడినందుకు అతన్ని చితక్కొట్టిన చరణ్ ఫ్యాన్స్..

సునిషిత్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు. తాజాగా ఓ ఛానల్ కి సునిషిత్ ఇంటర్వ్యూ ఇచ్చి చరణ్ గురించి, ఉపాసన గురించి తప్పుగా మాట్లాడాడు. ఉపాసనపై పలు వ్యాఖ్యలు చేశాడు.

Ram Charan fans : ఉపాసన గురించి తప్పుగా మాట్లాడినందుకు అతన్ని చితక్కొట్టిన చరణ్ ఫ్యాన్స్..

Ram Charan Fans attack on Sunishith for speaking bad words on Upasana

Updated On : May 14, 2023 / 9:58 AM IST

Upasana :  RRR తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) క్రేజ్ ఇండియా వైడ్ పెరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చరణ్ కు అభిమానులు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చరణ్ కు మెగా ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. సాధారణంగానే అభిమానులు వాళ్ళ హీరోలని, హీరో ఫ్యామిలీల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోరు. ఏదో ఒక విధంగా విమర్శించడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం లాంటివి చేస్తారు. తాజాగా ఓ వ్యక్తి చరణ్ భార్య ఉపాసన గురించి తప్పుగా మాట్లాడటంతో చరణ్ ఫ్యాన్స్ అతన్ని దారుణంగా కొట్టారు.

సునిషిత్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు. ఆ హీరో నాకు తెలుసు, నా సినిమాను ఆ హీరో లాక్కున్నాడు, ఆ హీరో నా వల్లే స్టార్ అయ్యాడు, ఆ హీరోయిన్ తో నాకు అఫైర్ ఉంది.. ఇలా తాను ఓ పెద్ద హీరోలాగా ఫీలయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు సునిషిత్. గతంలో ఇలాగే లావణ్య త్రిపాఠి మీద వ్యాఖ్యలు చేయడంతో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. అయినా అతని బుద్ది మారకుండా మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

Dulquer Salmaan : సూపర్ హిట్ ‘సార్’ కాంబినేషన్ మరోసారి.. ఈ సారి దుల్కర్ సల్మాన్ తో..

తాజాగా ఓ ఛానల్ కి సునిషిత్ ఇంటర్వ్యూ ఇచ్చి చరణ్ గురించి, ఉపాసన గురించి తప్పుగా మాట్లాడాడు. ఉపాసనపై పలు వ్యాఖ్యలు చేశాడు. ఇవి వైరల్ గా మారడంతో చరణ్ అభిమానులు కొంతమంది శనివారం నాడు సునిషిత్ ఇంటిపై దాడి చేసి, సునిషిత్ ని చితక్కొట్టారు. అనంతరం అతనిచే చరణ్ కి, ఉపాసనకు క్షమాపణలు చెప్పించారు. ఈ నేపథ్యంలో చరణ్ ఫ్యాన్స్ నుంచి సునిషిత్, అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఛానల్స్ పై విమర్శలు దారుణంగా వస్తున్నాయి. చరణ్ ఫ్యాన్స్ సునిషిత్ ని కొట్టిన వీడియో వైరల్ గా మారింది.