Ram Charan : వరుణ్ లావణ్య రిసెప్షన్ కి రామ్ చరణ్ రాలేదా? మహేష్ బాబుతో కలిసి వేరే పార్టీకి?
మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, అల్లు అర్జున్ పెళ్ళికి వెళ్లి రిసెప్షన్ కి రాలేదేంటి అని అభిమానులు సందేహిస్తున్నారు. లేదా వచ్చినా ఫొటోలు బయటకి రాలేదా అని కూడా ఆలోచిస్తున్నారు.

Ram Charan Mahesh Babu attending to Special Party with Families
Ram Charan : ఇటీవల ఇటలీలో పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల రెసెప్షన్ నిన్న ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించారు. అనేకమంది సినీ ప్రముఖులు వరుణ్ లావణ్య రెసెప్షన్ కి హాజరయ్యారు. కానీ కొంతమంది స్టార్ హీరోలు మాత్రం రాకపోవడం గమనార్హం. మెగా ఫ్యామిలీ వాళ్లే కొంతమంది రాలేదని సమాచారం. వరుణ్ లావణ్య రిసెప్షన్ ఫొటోలు బయటకి రాగా ఇందులో ఎక్కడా కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్ కనిపించలేదు. ఇక నందమూరి ఫ్యామిలీ అయితే ఎవ్వరూ రాలేదు. మహేష్ బాబు, నాగార్జున, నాని.. లాంటి స్టార్స్ కూడా రాలేదు.
కానీ మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్, అల్లు అర్జున్ పెళ్ళికి వెళ్లి రిసెప్షన్ కి రాలేదేంటి అని అభిమానులు సందేహిస్తున్నారు. లేదా వచ్చినా ఫొటోలు బయటకి రాలేదా అని కూడా ఆలోచిస్తున్నారు. అయితే రామ్ చరణ్, మహేష్ బాబు విడిగా వేరే పార్టీకి తమ ఫ్యామిలీలతో కలిసి వెళ్లినట్టు సమాచారం.
Also Read : Guntur Kaaram Song : త్రివిక్రమ్ పుట్టిన రోజు నాడు.. ‘గుంటూరు కారం’ దమ్ మసాలా ఫుల్ సాంగ్ ?
ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన క్లబ్ ఓపెనింగ్ అవ్వడంతో ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు వెళ్లగా రామ్ చరణ్, ఉపాసన.. మహేష్, నమ్రత, వెంకటేష్.. మరికొంతమంది కూడా హాజరయ్యారు. చరణ్, ఉపాసన, మహేష్, నమ్రత మరికొంతమంది కలిసి దిగిన ఫొటోలని నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఈవెంట్ రెండు రోజుల క్రితం జరిగిందని సమాచారం. మరి మెగా ఫ్యామిలీ అయిన చరణ్, బన్నీ వరుణ్ రిసెప్షన్ కి ఎందుకు రాలేదని, వచ్చినా ఫొటోలు బయటకి రాలేదా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.
View this post on Instagram