Ram Charan : గీతా ఆర్ట్స్‌లో 300 కోట్లతో రామ్‌చరణ్ సినిమా.. కన్‌ఫార్మ్ చేసిన దర్శకుడు!
అల్లు అరవింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ పతాకం పై రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నాడట. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోందని తెలియజేశారు.

Ram Charan movie with allu aravind under chandoo mondeti direction
Ram Charan – Allu Aravind : రామ్ చరణ్ తో మూవీస్ చేసేందుకు బాలీవుడ్ టు టాలీవుడ్ మేకర్స్ తెగ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత బుచ్చిబాబు, సుకుమార్, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ వివరాలు బయటకి వచ్చాయి. అల్లు అరవింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ పతాకం పై రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నాడట.
కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు చందూ మొండేటి. ఆ మూవీ తరువాత ఇప్పటివరకు ఈ దర్శకుడు మరో సినిమా ప్రకటించలేదు. తాజాగా ఒక మూవీ ఫంక్షన్ లో పాల్గొన్న ఈ దర్శకుడు మాట్లాడుతూ.. “కార్తికేయ 2 రిలీజ్ కి ముందే గీతా ఆర్ట్స్ లో నేను ఒక సినిమా ఒప్పుకున్నాను. ఇక కార్తికేయ రిలీజ్ తరువాత అరవింద్ గారు నా దగ్గరకి వచ్చి.. రామ్ చరణ్ అండ్ హృతిక్ లాంటి వాళ్ళతో మూవీ చేద్దాం అనుకుంటున్నాము. అటువంటి కథ ఏమన్నా ఉందా? అని అడిగారు. అలాంటి కథ నా దగ్గర ఉండడం, అది వాళ్ళకి చెప్పడం, నచ్చడం జరిగింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది” అని తెలియజేశాడు.
కాగా ఆ కథ రామ్ చరణ్ తో ఉండబోతుందని, దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోందని తెలియజేశాడు. ప్రస్తుతం దర్శకుడు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో చరణ్, అల్లు అరవింద్ కలయికలో వచ్చిన మగధీర ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్ళీ గీతా ఆర్ట్స్ లో భారీ బడ్జెట్ మూవీ అంటే మెగా అభిమానులు అంచనాలు పెరిగిపోతున్నాయి.