Ram Charan : రామ్చరణ్ బర్త్ డే పార్టీలో సందడి చేసిన కన్నడ దర్శకుడు.. నర్తన్తో సినిమా నిజమే!
కన్నడ దర్శకుడు నర్తన్తో (Narthan), రామ్ చరణ్ (Ram Charan) ఒక సినిమా సైన్ చేశాడని గతంలో వార్తలో వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్ట్ పై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవడంతో ఆ వార్తలు రూమర్స్ గా నిలిచిపోయాయి. తాజాగా..
Ram Charan : ‘ధృవ’ సినిమా నుంచి రామ్ చరణ్ (Ram Charan) తన మూవీ ఎంపికల ప్లాన్ అఫ్ యాక్షన్ మొత్తం చేంజ్ చేసేశాడు. కథకి ప్రాధాన్యత ఇస్తూనే తన మార్కెట్ ని పెంచుకొనే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే నక్కి నక్కి కాదు అంటూ RRR సినిమాతో ఏకంగా కుంభస్థలాని బద్దలా కొట్టాడు. పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా, గ్లోబల్ వైడ్ ఫేమ్ ని కూడా సంపాదించుకున్నాడు. అంతేకాదు త్వరలో త్వరలో హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Ram Charan : రామ్చరణ్ బర్త్ డే పార్టీ గ్రాండ్గా చేసిన ఉపాసన.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్..
అయితే హాలీవుడ్ మూవీ కంటే ముందు ప్రస్తుతం ఇండియాలో తను సైన్ చేసిన పలు ప్రాజెక్ట్ లు పూర్తి చేసే పనిలో పడ్డాడు. ప్రెజెంట్ శంకర్ తో ‘గేమ్ చెంజర్’ (Game Changer) సినిమా చేస్తుండగా.. ఆ తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా, సుకుమార్ డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నాడు. అలాగే కన్నడ దర్శకుడు నర్తన్ (Narthan), రామ్ చరణ్ కి కథ వినిపించాడని, చరణ్ కూడా ఓకే చెప్పాడని గతంలో వార్తలో వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్ట్ పై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవడంతో ఆ వార్తలు రూమర్స్ గా నిలిచిపోయాయి.
తాజాగా రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో నర్తన్ కనిపించడంతో ఈ ప్రాజెక్ట్ నిజమని తెలుస్తుంది. నిన్న (మార్చి 27) నైట్ ఉపాసన (Upasana), చరణ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ పార్టీకి టాలీవుడ్ స్టార్స్ తో పాటు చరణ్ తో పని చేసిన హీరోయిన్లు, దర్శకులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే నర్తన్, తమిళ ప్రొడ్యూసర్ KVN అటెండ్ అయ్యారు. దీంతో చరణ్ వీరిద్దరి కలయికలో సినిమా చేయబోతున్నాడు అని నెటిజెన్లు అభిప్రాయ పడుతున్నారు. మరి రామ్ చరణ్ గేమ్ ప్లాన్ ఎలా ఉందో చూడాలి.