Peddi: మొత్తం మార్చేస్తున్నారు.. కారణం రెహమానేనా.. పెద్ది ఇంకా వెయిటింగ్ లోనే!

పెద్ది.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ. ఆయన గత చిత్రం డిజాస్టర్ అయిన నేపధ్యంలో పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు, తగ్గట్టుగానే సినిమా నుంచి వస్తున్న కంటెంట్ ఆంచనాలను రెట్టింపు చేస్తోంది.

Peddi: మొత్తం మార్చేస్తున్నారు.. కారణం రెహమానేనా.. పెద్ది ఇంకా వెయిటింగ్ లోనే!

Ram Charan Peddi movie first song release postponed again

Updated On : October 15, 2025 / 4:31 PM IST

Peddi: పెద్ది.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ. ఆయన గత చిత్రం డిజాస్టర్ అయిన నేపధ్యంలో పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు, తగ్గట్టుగానే సినిమా నుంచి వస్తున్న కంటెంట్ ఆంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు సైతం పెద్ది సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఆడుగులు వేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఆటోమేటిక్ అతనిపై(Peddi) చాలా ప్రెజర్ ఏర్పడింది. అందుకే, ఎలాగైనా రామ్ చరణ్ కి కెరీర్ లో గుర్తుడిపోయే ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కంకణం కట్టుకోని కూర్చున్నాడు.

Siddu Jonnalagadda: జాక్ డిజాస్టర్ తరువాత కొరటాల శివ కాల్ చేశారు.. ఆ రెండిటి మధ్యలో ఒకటి.. తన కథనే చెప్పాడా?

ఈ నేపధ్యంలో పెద్ది సినిమాపై అంచనాలు ఇంకాస్త పెంచేలా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. ముందుగా దసరాకు విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ, కుదరలేదు. కనీసం, దీపావళికైనా వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, అది కూడా జరిగేలా కనిపించడం లేదు. దానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. అవును, ప్రస్తుతం రెహమాన్ తన మ్యూజికల్ కాన్సర్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. కాబట్టి, ఫస్ట్ సింగల్ విడుదల చేయాలంటే కనీసం ఒకరోజు టైం ఇవ్వాల్సి వస్తుంది. కానీ, ప్రస్తుతం రెహమాన్ ఫుల్ బిజీలో ఉన్నాడట. అందుకే, పెద్ది ఫస్ట్ సాంగ్ రిలీజ్ లేట్ అవుతుందట.

ఇక రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ విషయానికి వస్తే, నెక్స్ట్ మొంత్ హైదరాబాద్ లో భారీ ఎత్తున ఈ ఈవెంట్ జరుగనుంది. దీనికి లక్షల్లో ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆ వేదికపైనే పెద్ది ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయాలనీ భావిస్తున్నారట టీం. అలా జరిగితే సాంగ్ రీచ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవల్లో ప్రమోషన్ కూడా అయినట్టు ఉంటుంది అని అనుకుంటున్నారట. అయితే, ఇవన్నీ జరగాలంటే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే. ఒకవేళ అక్కడినుంచి రెస్పాన్స్ తేడాగా వస్తే మాత్రం మళ్ళీ వెయిటింగ్ తప్పదు. ఒకవేళ కుదిరితే మాత్రం, రెండు పండుగలు మిస్ అయినా కూడా భారీ ఈవెంట్ లో పెద్ది సాంగ్ విడుదల అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.