Ram Charan: జెర్సీ దర్శకుడితో స్పోర్ట్స్ డ్రామా.. చెర్రీ కల తీరేవేళ!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. అది ఇంకా విడుదల కాలేదు మరో సౌత్ దర్శక దిగ్గజం శంకర్ తో సినిమాను ఒక షెడ్యూల్ కూడా పూర్తిచేశాడు. మరోవైపు చెర్రీ తండ్రి..

Ram Charan
Ram Charan: ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. అది ఇంకా విడుదల కాలేదు మరో సౌత్ దర్శక దిగ్గజం శంకర్ తో సినిమాను ఒక షెడ్యూల్ కూడా పూర్తిచేశాడు. మరోవైపు చెర్రీ తండ్రి మెగాస్టార్ తో కలిసి నటించిన ఆచార్య కూడా విడుదలకు సిద్దమవుతుంది. కాగా, చరణ్ సినిమాల లైనప్ లో మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా ఒకటుంది. అదే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్న సినిమా. `మళ్లీ రావా`, `జెర్సీ` సినిమాలతో ఆకట్టుకున్న గౌతమ్ బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ తో అదరగొట్టాడు.
Pooja Hegde: మాల్దీవుల్లో అందాల మంట పెట్టిన పూజా హెగ్డే.. బాప్ రే బికినీ షో..!
కాగా.. రామ్ చరణ్ తో ఓ సినిమా చేసేందుకు గౌతమ్ చాలారోజుల క్రితమే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. చరణ్ కోసం గౌతమ్ పాన్ ఇండియా స్థాయిలో ఓ కథ రాసుకుకోగా చెర్రీ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అదిరిపోయే స్క్రిప్టుని సిద్ధం చేశాడని కథనాలు వినిపించాయి. ఆ తర్వాత ఏమైందో కానీ ఆ సినిమా మీద మళ్ళీ ఎక్కడా హడావుడి కనిపించలేదు. అయితే, చెర్రీ సినిమాల లైనప్ లో గౌతమ్ సినిమా కూడా ఉందని ఇది వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని చెప్తున్నారు.
Indian 2: కాజల్ స్థానంలో త్రిష.. ప్రెగ్నెన్సీయే కారణమని పుకార్లు!
ఇక, ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది కూడా జెర్సీ మాదిరే స్పోర్ట్స్ డ్రామాగా చెప్తున్నారు. గతంలో ఒకసారి చరణ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ మెన్ గా కనిపించడమనేది తన డ్రీమ్ అని, అలాంటి పాత్రకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. గౌతమ్ అలాంటి కథతోనే చరణ్ దగ్గరకు వెళ్లడంతో గ్రీన్ సిగ్నల్ పడిందట. మొత్తానికి ఇలా చరణ్ తన కల నెరవేరుతుండగా ఈ సినిమాతో గౌతమ్ మాత్రం స్టార్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ కొట్టేశాడు. అయితే, సినిమా మొదలయ్యేందుకు మాత్రం కొంచెం టైం పట్టేలా ఉంది.