Ram Charan : పుట్టినరోజుని శ్రీవారి సన్నిధిలో జరుపుకోబోతున్న రామ్‌చరణ్.. ఫ్యామిలీతో తిరుపతికి..

తన పుట్టినరోజుని శ్రీవారి సన్నిధిలో జరుపుకోబోతున్న రామ్‌చరణ్. ఉపాసన, క్లీంకారతో కలిసి తిరుపతికి..

Ram Charan : పుట్టినరోజుని శ్రీవారి సన్నిధిలో జరుపుకోబోతున్న రామ్‌చరణ్.. ఫ్యామిలీతో తిరుపతికి..

Ram Charan went to tirupati with Upasana Klin Kaara

Updated On : March 26, 2024 / 5:57 PM IST

Ram Charan : రేపు మార్చి 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అన్న విషయం అందరికి తెలిసిందే. గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియా అంతా చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ తో జోష్ గా ఉంది. ఇక ఆ జోష్ ని రెట్టింపు చేయడం కోసం సినిమా మేకర్స్ కూడా చరణ్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. ఈ ఏడాది బర్త్ డేని మాత్రం.. ఓ రేంజ్ లో నిర్వహించడానికి అభిమానులు సన్నిధం అవుతున్నారు.

ఇది ఇలా ఉంటే, రామ్ చరణ్ తన పుట్టినరోజుని శ్రీవారి సన్నిధిలో జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. ఉపాసన, క్లీంకారతో కలిసి ఈరోజు సాయంత్రం తిరుపతి బయలుదేరారు. రేపు పుట్టినరోజు నాడు శ్రీవారి అశీసులు తీసుకోని తన బర్త్ డేని చరణ్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం చరణ్ తిరుపతి బయలుదేరిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Game Changer : మరోసారి చర్చగా మారిన ‘జరగండి’ సాంగ్ బడ్జెట్.. ఆ ఖర్చు వీడియోలో కనిపిస్తుందా..!

కాగా రేపు ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి’ సాంగ్ రిలీజ్ కాబోతుంది. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ని ప్రభుదేవా కోరియోగ్రఫీ చేసారు. రేపు ఉదయం 9 గంటలకు ఈ సాంగ్ రిలీజ్ కానుంది. అలాగే సుకుమార్ దర్శకత్వంలో రాబోయే RC17 టైటిల్, బుచ్చిబాబు RC16 ఫస్ట్ లుక్ కూడా వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరి రేపు ఎలాంటి సర్‌ప్రైజ్‌లు వస్తాయో చూడాలి.