టుస్సాడ్స్‌ మ్యూజియంలో రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం లాంఛ్‌కు ముహూర్తం ఫిక్స్‌

ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారి మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు.

టుస్సాడ్స్‌ మ్యూజియంలో రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హం లాంఛ్‌కు ముహూర్తం ఫిక్స్‌

Updated On : April 26, 2025 / 8:17 PM IST

లండన్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సినీనటుడు రామ్ చ‌ర‌ణ్ మైన‌పు విగ్ర‌హాన్ని మే 9న లాంఛ్ చేయనున్నారు. అనంతరం ఆ మైనపు విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారు.

ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారి మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. సినిమా, స్పోర్ట్స్‌తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఉంటాయి. బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఐశ్వర్యరాయ్‌, షారుక్‌ ఖాన్‌ మైనపు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఇప్పుడు చెర్రీకి కూడా ఈ అరుదైన గౌర‌వం ద‌క్కుతోంది. కొన్ని నెలల క్రితమే చెర్రీతో పాటు ఆయన పెంపుడు కుక్క రైమ్‌లకు సంబంధించిన కొలతలను మేడం టుస్సాడ్స్ సిబ్బంది తీసుకున్నారు.

Also Read: బన్నీతో పాటు అతడి పిల్లలకు గిఫ్టులు పంపిన విజయ్ దేవరకొండ.. ఏం గిఫ్టులంటే..?

ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ “పెద్ది” మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సమర్పణలో వస్తోంది.

వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వస్తున్న “పెద్ది” మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. చెర్రీకి జోడీగా ఇందులో జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది.