Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ ఇంట్లో విషాదం, కరోనాతో మృతి
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంట్లో విషాదం నెలకొంది. వర్మ సోదరుడు సోమశేఖర్ ఆదివారం(మే 23,2021) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

Ram Gopal Varma
Ram Gopal Varma Brother Dies : దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంట్లో విషాదం నెలకొంది. వర్మ సోదరుడు సోమశేఖర్ ఆదివారం(మే 23,2021) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. శ్వాస ఇబ్బందులు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. చికిత్స అందుతుండగానే.. ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు.
‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ మూవీకి ఆయన దర్శకుడిగా పని చేశారు. రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, తన జీవితంలో కీలకమైన వ్యక్తుల్లో సోమశేఖర్ ఒకరని పలు సందర్భాల్లో వర్మ స్వయంగా చెప్పారు.
చిత్రపరిశ్రమలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను బలితీసుకుంది. కొన్ని రోజులుగా కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు.