Ram Gopal Varma : వారిద్దరు చనిపోయినప్పుడు నెల రోజుల పాటు బాధ పడ్డాను.. రామ్ గోపాల్ వర్మ!

రామ్ గోపాల్ వర్మకి అసలు ఎమోషన్స్ అనేవి ఉండవు అనుకుంటా అని కామెంట్స్ చేస్తారు చాలామంది. అయితే RGV కూడా ఒక విషయంలో ఎంతో ఎమోషనల్ అయ్యాడట.

Ram Gopal Varma : వారిద్దరు చనిపోయినప్పుడు నెల రోజుల పాటు బాధ పడ్డాను.. రామ్ గోపాల్ వర్మ!

Ram Gopal Varma Emotional

Updated On : June 22, 2023 / 6:27 PM IST

Ram Gopal Varma emotional : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చేసే ట్వీట్స్, మాటలు, పనులు.. చూసి వర్మకి అసలు ఎమోషన్స్ అనేవి ఉండవు అనుకుంటా అని కామెంట్స్ చేస్తారు చాలామంది. అయితే RGV కూడా ఒక విషయంలో ఎంతో ఎమోషనల్ అయ్యాడట. తనకి ఎంతో ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు చనిపోయినప్పుడు.. బాధతో దాదాపు నెల రోజులు పాటు బయటకి రాకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయట. ఇంతకీ ఆ ఇద్దరి వ్యక్తులు ఎవరని ఆలోచిస్తున్నారా..?

Vyooham Teaser : ‘వ్యూహం’ టీజర్ ముహూర్తం సెట్ చేసిన వర్మ..

ఇప్పటికే మీ మైండ్ ఒక పేరు వినిపించి ఉంటది. అతిలోక సుందరి ‘శ్రీదేవి’కి తను వీరాభిమానిని అని వర్మ ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తన టీనేజ్ నుంచి ఆమెను చూస్తూ వచ్చిన వర్మ.. సినిమాలోకి వచ్చిన తరువాత శ్రీదేవితో కలిసి కూడా పని చేశాడు. కాగా ఆమె చనిపోయినప్పుడు బాగా ఎమోషనల్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడట. నెలరోజులు పాటు ఎక్కడికి బయటకి వెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడట. ఇప్పటికి కొంత బాధ అయితే అలాగే ఉన్నట్లు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Ram Gopal Varma getting emotional when the loss of Sridevi and Jiah Khan

Ram Gopal Varma getting emotional when the loss of Sridevi and Jiah Khan

ఇక ఇదే ఇంటర్వ్యూలో ఇంకో హీరోయిన్ గురించి కూడా మాట్లాడాడు. అమితాబ్ బచ్చన్ మెయిన్ లీడ్ లో వర్మ తెరకెక్కించిన సినిమా ‘నిశ్శబ్ద్’. ఈ సినిమాలో ‘జియా ఖాన్’ (Jiah Khan) ప్రధాన పాత్ర పోషిస్తూ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ సినిమా తరువాత కేవలం రెండు సినిమాల్లో నటించిన ఈ భామ.. 2013 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎంతో టాలెంట్ ఉన్న జియా ఖాన్ పెద్ద హీరోయిన్ అవుతుందని అనుకున్నాడట వర్మ. అలాంటి జియా ఆత్మహత్య చేసుకోవడం తనని ఎంతో బాధకి గురి చేసిందని చెప్పుకొచ్చాడు.

Ram Gopal Varma getting emotional when the loss of Sridevi and Jiah Khan

Ram Gopal Varma getting emotional when the loss of Sridevi and Jiah Khan