కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో పెగ్గెయ్యాలి : ఇదే నా ఛాలెంజ్..
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినూత్న ఛాలెంజ్ విసిరారు..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినూత్న ఛాలెంజ్ విసిరారు..
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విసిరిన ఛాలెంజ్ ఒకటి మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోవిడ్ 19 ఎఫెక్ట్‌తో కొనసాగుతోన్న లాక్‌డౌన్ కారణంగా సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ‘కాఫీ ఛాలెంజ్’, ‘మీ ఎట్ 20 ఛాలెంజ్’, పాయల్ రాజ్‌పుత్ ‘పిల్లో ఛాలెంజ్’, ‘బీ ది రియల్ మేన్’.. ఇలా రకరకాలు చాలా ఛాలెంజ్‌లు రన్ అవుతున్నాయి.
రీసెంట్‌గా ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడారు. ఆ సమయంలో మీరెవరికైనా ఛాలెంజ్ విసరాలనుకుంటే ఎవరికి, ఎలాంటి చాలెంజ్ విసురుతారు? అని వర్మను ప్రశ్నించగా.. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విస్కీ ఛాలెంజ్ విసరాలనుకుంటున్నానని చెప్పి షాకిచ్చారు వర్మ.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీవీలో అందరికీ కనిపించేలా గ్లాస్ విస్కీ తాగాలనేది నా ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆల్కాహాల్ దొరక్క ఇబ్బందిపడుతున్నారని, ఇలాంటి సమయంలో వాళ్లందరూ ఉడుక్కునేలా, కుళ్లుకునేలా కేసీఆర్ ఓ గ్లాస్ వీస్కీ తాగాలని వర్మ చెప్పారు. ఇటీవల లిక్కర్ హోమ్ డెలివరీ గురించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వర్మ విజ్ఞప్తి చేయగా.. తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, వర్మకు పంచ్ వేసిన సంగతి తెలిసిందే.