Adivi Sesh : ‘మేజర్’ సినిమా చూసి.. అడివి శేష్ ని పిలిచి మరీ అభినందించిన మాజీ రాష్ట్రపతి
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల మేజర్ సినిమా చూసి నచ్చడంతో అడివి శేష్ ని ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. అడివి శేష్ తో కాసేపు ఈ సినిమా గురించి చర్చించారు.

Ram Nath Kovind congratulated Adivi Sesh after watching the Major movie
Ram Nath Kovind : 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్(Mahor Sandeep Unni Krishnan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్(Major). అడవి శేష్(Adivi Sesh) హీరోగా, సయీ మంజ్రేకర్(Saiee Manjrekar0 హీరోయిన్ గా, శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. చిన్న సినిమాగా పాన్ ఇండియా రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. గత సంవత్సరం మే 22న ఈ సినిమా రిలీజయింది.
మేజర్ సినిమా థియేటర్స్ లో మంచి విజయం సాధించిన అనంతరం ఓటీటీలలో, టీవీలలో కూడా మంచి రీచ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, యోగి ఆదిత్యనాథ్, ఉద్దవ్ థాక్రే, రాజ్ నాథ్ సింగ్.. ఇలా అనేకమంది మేజర్ సినిమాని అభినందించి అడివి శేష్, యూనిట్ ని కూడా ప్రశంసించారు. తాజాగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అడివి శేష్ ని అభినందించారు.
Amitabh Bachchan : ట్రాఫిక్ వల్ల షూటింగ్ కి లేట్ అవుతుందని.. లిఫ్ట్ అడిగి బైక్ మీద వెళ్లిన అమితాబ్..
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల మేజర్ సినిమా చూసి నచ్చడంతో అడివి శేష్ ని ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. అడివి శేష్ తో కాసేపు ఈ సినిమా గురించి చర్చించారు. దీంతో అడివి శేష్ రామ్‌నాథ్ కోవింద్ ని కలవడంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. రామ్‌నాథ్ కోవింద్ ని కలిసిన వీడియోని అడివి శేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మేజర్ సినిమా రిలీజయి సంవత్సరం కావొస్తుంది. ఇంకా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. గౌరవనీయులైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారిని కలిశాను. ఆయన మేజర్ సినిమా చూసి దాని గురించి మాట్లాడటం నేను మర్చిపోలేను. నా లైఫ్ లో ఇదొక మర్చిపోలేని మూమెంట్ అంటూ ఎమోషనల్ గా పోస్టు చేశారు. దీంతో మరోసారి అడివి శేష్ ని అంతా అభినందిస్తున్నారు. ఇక అడివి శేష్ ప్రస్తుతం గూడాచారి 2 సినిమా షూట్ లో ఉన్నాడు.