Skanda New Trailer : రామ్ ‘స్కంద’ కొత్త ట్రైలర్ రిలీజ్.. రింగులో దిగితే రీసౌండ్ రావాలి..

రామ్ 'స్కంద' మూవీ నుంచి సాంగ్స్, ట్రైలర్, టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా మరో కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Skanda New Trailer : రామ్ ‘స్కంద’ కొత్త ట్రైలర్ రిలీజ్.. రింగులో దిగితే రీసౌండ్ రావాలి..

Ram Pothineni Sreeleela Skanda New Trailer released

Skanda New Trailer : ఎనర్జిటిక్ స్టార్స్ రామ్ పోతినేని (Ram Pothineni), శ్రీలీల (Sreeleela) కలిసి నటిస్తున్న చిత్రం ‘స్కంద‌’. మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను ఈ మూవీని ఊరమస్ గా తెరకెక్కించాడు. రామ్ ని ఇప్పటివరకు చూడనంత మాస్ గా ఈ మూవీలో బోయపాటి చూపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి సాంగ్స్, ట్రైలర్, టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో రామ్ ని రెండు గెటప్స్ లో చూపించి మెప్పించాడు. అయితే తాజాగా మరో కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Salaar : ప్రభాస్ ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకోండి.. సలార్ వచ్చేస్తున్నాడు.. ఆ పండక్కే రిలీజ్..

ఈ ట్రైలర్ ని పూర్తి యాక్షన్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. అలాగే ‘రింగులో దిగితే రీసౌండ్ రావాలి’ అనే బోయపాటి మార్క్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీలో బోయపాటి మూడు యాక్షన్ సీక్వెన్స్ ని హైలైట్ గా డిజైన్ చేశాడని, సినిమాకే అవి హైలైట్ కాబోతున్నాయని రామ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కి థమన్ బ్యాక్‌గ్రౌండ్ మరో ప్లస్ కానుందట. అసలే బోయపాటి గత సినిమా ‘అఖండ’కి థమన్ ఇచ్చిన బీజీఎమ్ తో థియేటర్ బాక్సలు బద్దలయ్యిపోయాయి. దీంతో ఈ మూవీ ఫైట్ సీక్వెన్స్ పై యాక్షన్ లవర్స్ మంచి అంచనాలే పెట్టుకున్నారు.

Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో నవీన్ పోలిశెట్టి రికార్డులు..

కాగా ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్, ప్రిన్స్, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్ లో మెరబోతుంది. సెప్టెంబ‌ర్ 28న తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ బాష‌ల్లో ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. మరి ప్లాప్ ల్లో ఉన్న రామ్ కి ఈ మూవీ సక్సెస్ ఇస్తుందా..? లేదా..? చూడాలి.