వైసీపీకి కలిసొస్తుందా! : ఎన్టీఆర్‌కు మళ్లీ వెన్నుపోటు పొడిచారు

ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్ సినిమా విడుదల ఆగిపోవడంపై విలేఖరుల సమావేశం పెట్టి ఎన్‌టీఆర్‌కు మరొకసారి వెన్నుపొటు పొడిచారంటూ రామ్ గోపాల్ వర్మ విమర్శించారు. ఎవరో కోన్‌కిస్కా గాళ్లు చెబితే కోర్టులు సినిమాని ఆపేస్తాయా? అని ప్రశ్నించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వర్మ సినిమా విడుదలైన అన్నిచోట్ల మంచి టాక్ వస్తోందని, థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయని వెల్లడించారు.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ
ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందన్న ఆసక్తితోనే సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని, సినిమాను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలపై వర్మ మండిపడ్డారు. వైసీపీకి మేలు చేసేందుకే ఈ సినిమా తీశామంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ వర్మ స్పష్టం చేశారు. సినిమాని అడ్డుకుని ఏం సాధిస్తారు. నిజాన్ని ఎప్పటికీ దాచలేరు. సినిమా ఆపి ఎన్టీఆర్‌కు మరోసారి వెన్నుపోటు పొడిచారని అన్నారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష
ఆనాడు ఎన్టీఆర్‌ను గద్దె దించాక సింహ గర్జన సభ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వలేదని, ఆ మానసిక క్షోభతో ఆయన చనిపోయారని, ఇప్పుడు సినిమాను అడ్డుకుని మరోసారి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్నారు. దీనికి వెనుక ఎవరున్నారన్నది నేను చెప్పనక్కర్లేదు. అందరికీ తెలుసునన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యులెవరూ అండగా నిలవలేదని, కానీ ఇప్పుడు చట్లం ద్వారా ఎన్టీఆర్‌ను గెలిపించుకుంటామని అన్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు వర్మ చెప్పారు.
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు