బాలకృష్ణ.. నాగబాబు వివాదంపై వర్మ రియాక్షన్

  • Published By: vamsi ,Published On : May 31, 2020 / 04:44 AM IST
బాలకృష్ణ.. నాగబాబు వివాదంపై వర్మ రియాక్షన్

Updated On : May 31, 2020 / 4:44 AM IST

బాలకృష్ణ వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారాయి. బాలయ్య, మాటలు జాగ్రత్త అంటూ నాగబాబు నోరెత్తడంతో.. ఇండస్ట్రీలో రెండు వాదనలు వచ్చాయి. బాలయ్య అభిప్రాయం ఆయనది మాత్రమే కాదు. మా అందరిదీ. మేం చెప్పలేకపోయాం.. ఆయన బైటపెట్టారని అనడం.. ఈ సమావేశం గురించి నరేశ్‌, జీవితా రాజశేఖర్‌, ఫిలిమ్‌ ఛాంబర్‌, కౌన్సిల్‌లోని సభ్యులెవరికీ తెలియదని అనడం.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఇలా సాగుతూనే ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితిలోనే కాంట్రవర్శీ అనగానే గుర్తొచ్చే రామ్‌గాపాల్ వర్మ ఇది చాలా చిన్న విషయం అంటూ కొట్టిపారేశారు. అంతేనా మీడియానే దీనిని హైలెట్ చేస్తుందంటూ కాస్త తనదైన శైలిలో మీడియాకు చురకలు అంటించాడు. 

బాలకృష్ణ ఏదో కామన్‌‌గా ఆ మాట అనుంటారని, పెద్ద బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసి మీడియా చూపిస్తుందని, బాలయ్య మాటల్లో అంతగా పట్టించుకోవాల్సిన విషయం ఉందని అయితే నేను అనుకోవడం లేదు. ఆయన కామెంట్ చేయడం ద్వారా ఏమైంది?? రెండు మూడు రోజుల అరుస్తారు.. తరువాత మెల్లగా సర్దుకుంటుంది. నాలుగు రోజుల తరువాత అందరూ మరిచిపోతారు. ఆ ముందు రోజుకి తరువాత రోజుకి పెద్దగా తేడా ఉండదు’ అంటూ చెప్పుకొచ్చారు.