బాబోయ్.. రానా ఏంటి ఇలా అయిపోయాడు!

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 09:43 AM IST
బాబోయ్.. రానా ఏంటి ఇలా అయిపోయాడు!

Updated On : October 2, 2019 / 9:43 AM IST

బాహుబలి సినిమాలో రానా ఎలా ఉండేవాడు.. ఆ కటౌట్, ఆ కండలు… ఈ సినిమాలో బాహుబలి పాత్ర చేసిన ప్రభాస్‌కి ఎంత పేరు వచ్చిందో.. విలన్ బల్లాల దేవుడి పాత్ర చేసిన రానాకు కూడా అంతే పేరు వచ్చింది. అలాంటి రానా గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడట. ఇప్పుడు రానాని చూస్తుంటే భయమేస్తోంది. అసలు రానాకి ఏమైంది..?

వివరాల్లోకి వెళితే.. రానాకి కొన్ని రోజుల క్రితం విదేశాల్లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ రానా మాత్రం అదంతా నిజం కాదు.. తప్పుడు వార్తలను నమ్మెద్దని.. తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే తాజాగా రానా పోస్ట్ చేసిన ఫోట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటో చూసినవారంతా షాక్ అవుతున్నారు. బాహుబలి మూవీలో కండలు తిరిగిన బాడీతో కనిపంచిన బల్లాలదేవుడు ఇంతగా చిక్కిపోడానికి కారణం ఏమిటా.. అని ఆలోచనలో పడ్డారు. 

అయితే మంగళవారం (అక్టోబర్ 1, 2019) రానా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటో చూసి అభిమానులంతా బాగా బాధపడుతున్నారు. ప్రముఖ బ్యాంకుకు సంబంధించిన మిలీనియా కార్డు గురించి చెబుతూ.. మిలీనియల్స్‌ జీవనశైలి సులభంగా ఉంటుందని ఎవరు చెప్పారు. అయితే HDFC బ్యాంక్‌ మిలీనియాతో జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.. అంటూ కార్డు పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోపై స్పందించిన రానా అభిమానులు.. అన్నా అసలు ఏమైంది. ఇలా ఉన్నావేంటి. మా కోసమైనా ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.