Animal : యానిమల్ రిలీజ్ వాయిదా.. ఇక పోటీ చిరు, రజిని మధ్యనే..

ఆగష్టు రేస్ నుంచి యానిమల్ తప్పుకుంది. దీంతో చిరు అండ్ రజిని మధ్యనే పోటీ ఉండబోతుంది.

Animal : యానిమల్ రిలీజ్ వాయిదా.. ఇక పోటీ చిరు, రజిని మధ్యనే..

ranbir kapoor animal movie postpone from august

Animal : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ (Ranbir kapoor) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ యానిమల్. టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన డైరెక్టర్ సందీప్ వంగ.. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మాఫీయా బ్యాక్ గ్రౌండ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రీ టీజర్ ఆడియన్స్ లో సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

Mayor weds Alligator : మొసలిని పెళ్లాడిన మేయర్.. ఎక్కడో తెలుసా?

ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఆగష్టు 11న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కి సినిమా రావడం లేదని వార్తలు వినిపిస్తుంది. సినిమాకి సంబంధించిన వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. దీంతో ఆగష్టులో చిరు అండ్ రజిని మధ్యనే పోటీ ఉండబోతుంది. చిరంజీవి – భోళా శంకర్ (Bhola Shankar) 11న, రజినీకాంత్ – జైలర్ (Jailer) 10న రిలీజ్ కాబోతున్నాయి.

The Legend of Hanuman : ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 వచ్చేస్తుంది.. మొదటి రెండు బ్లాక్ బస్టర్..

కాగా యానిమల్ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దాం అనుకుంటే అప్పుడు జవాన్ రిలీజ్ ఉండడంతో అప్పుడు కుదరడం లేదు. దీంతో ఈ సినెన్ని ఏకంగా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.