Ranbir Kapoor: బాలీవుడ్ పరిశ్రమపై రణ్‌బీర్ కపూర్ హాట్ కామెంట్స్.. అయోమయంతో ఆగం!

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Ranbir Kapoor: బాలీవుడ్ పరిశ్రమపై రణ్‌బీర్ కపూర్ హాట్ కామెంట్స్.. అయోమయంతో ఆగం!

Ranbir Kapoor Comments On Bollywood Industry Goes Viral

Ranbir Kapoor: బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ‘యానిమల్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ కావడంతో అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వివాదాలకు దూరంగా ఉండే రణ్‌బీర్ కపూర్, తాజాగా బాలీవుడ్ పరిశ్రమపై కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన కామెంట్స్‌పై పలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Ranbir Kapoor : నేను మంచి భర్తను కాదు.. రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యలు

బాలీవుడ్ పరిశ్రమ గతకొంతకాలంగా ట్రాక్ తప్పిందని రణ్‌బీర్ కపూర్ అన్నాడు. గత 20 ఏళ్ల కాలంలో వెస్ట్రన్ కల్చర్‌పై ఆధారపడి బాలీవుడ్ తన ఒరిజినాలిటీని మిస్ అయ్యిందని తాను భావిస్తున్నట్లుగా రణ్‌బీర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రేక్షకులకు ఏం కావాలో అది తెలుసుకోవడంలో మేకర్స్ విఫలమవుతున్నారని.. అయోమయంలో పడి బాలీవుడ్ పరిశ్రమ ఆగమయ్యిందని రణ్‌బీర్ తెలిపాడు. కొత్త ట్యాలెంట్‌కు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అతడు పేర్కొన్నాడు.

Ranbir Kapoor : కూతురు కోసం ఆరు నెలలు సినిమాలకి హాలిడేస్ ఇస్తున్న రణబీర్ కపూర్..

కొంతమంది హీరోహీరోయిన్లు కొత్తవారికి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదని.. వారు ఈ పద్ధతిని మార్చుకుంటే, ఇండస్ట్రీలో కొత్త ట్యాలెంట్స్ బయటకొస్తాయని.. అప్పుడు మళ్లీ ఇండస్ట్రీ సక్సెస్ బాటలో పయనిస్తుందని రణ్‌బీర్ తెలిపాడు. త్వరలోనే ఈ విషయంలో మార్పు వస్తుందని తాను ఆశిస్తున్నట్లుగా రణ్‌బీర్ అన్నాడు. ఇక ఇటీవల ‘తూ జూఠీ మై మక్కార్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న రణ్‌బీర్ కపూర్, ‘యానిమల్’ మూవీతో మరోసారి హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.