Ranbir Kapoor : చరణ్ పాటకు రణ్‌బీర్ మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'యానిమల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటితో ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడంతో, చిత్ర యూనిట్ అంతా కలిసి డాన్స్ లు వేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్..

Ranbir Kapoor : చరణ్ పాటకు రణ్‌బీర్ మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్!

Ranbir Kapoor

Updated On : February 22, 2023 / 5:21 PM IST

Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాని తెలుగు, హిందీలో డైరెక్ట్ చేసిన తరువాత సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘యానిమల్’. బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ చిత్రం పై టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్యాంగ్ స్టార్ యాక్షన్ క్రైమ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ షూటింగ్ గత ఏడాది ఏప్రిల్ లో మొదలైంది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా చిత్రీకరణ నిన్నటితో (ఫిబ్రవరి 21) పూర్తి అయ్యింది.

Alia – Ranbir : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్.. ఉత్తమ నటీనటులుగా రణ్‌బీర్, అలియా..

దీంతో సెట్ లో చిత్ర యూనిట్ అంతా కలిసి డాన్స్ లు వేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం సినిమాలోని ‘జిగేలురాణి’ సాంగ్ కి రణ్‌బీర్ మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ-1 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆగష్టు 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి డైరెక్టర్ సందీప్ రెడ్డి మొదటి సినిమాలా ఈ చిత్రాన్ని కూడా గ్యాంగ్ స్టార్ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుపుతాడా? లేదా? అనేది చూడాలి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లు, లీకైన ఫోటోలు అయితే ఆడియన్స్ లో అంచనాలు పెంచేశాయి.