ఆ ఫొటో ఫేక్.. రణు మండల్ మేకప్ ఆర్టిస్ట్

రైల్వే స్టేషన్ లో పాటలు పాడుతూ దీన స్థితిలో కాలం గడుపుతున్న రణు మండల్ కూడా ఓవర్ నైట్ స్టార్ అయిన విషయం తెలిసిందే. తన వాయిస్ తో అందరినీ ఆకట్టుకుని సింగర్ గా మారిపోయింది. ఆమె వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆమె జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మొన్నటివరకు అడుక్కుంటూ బ్రతికిన ఆమె రూపం.. వేషం మారిపోయింది.
రణుమొండల్ లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కా నాగ్మా హై అనే పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే ఇటీవల ఓ అభిమాని తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించగా, కాస్త దురుసుగా ప్రవర్తించి వార్తలలోకి ఎక్కింది. ఆ సంఘటనకి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, నెటిజన్స్ ఆమె ప్రవర్తనని తప్పుపట్టారు.
ఇక రీసెంట్‌గా రణు ఓ మాల్ ఓపెనింగ్‌కి హాజరు కాగా, ఆ సమయంలో ఓవర్ మేకప్ వేసుకుందని సోషల్ మీడియాలో ఒకటే వార్తలు వచ్చాయి. దీనిపై కూడా రణు ఇప్పటి వరకు స్పందిచకపోగా, మేకప్ ఆర్టిస్ట్ సంధ్య ఫోటో ఫేక్ అంటూ అందరికీ క్లారిటీ ఇచ్చేసింది. ఒరిజినల్ ఫోటో, ఫేక్ ఫోటోని రెండు జత చేస్తూ.. జోక్స్, ట్రోల్స్ మనందరికి నవ్వు తెప్పిస్తాయి. కాని అవి ఇతరుల సెంటిమెంట్స్‌ని హర్ట్ చేస్తాయంటు ఆమె తన పోస్ట్ లో పేర్కొంది.