వేషం మారింది వాయిస్ మారలేదు: రెండవ సాంగ్ తో ఫిదా చేసిన రణు మండల్‌

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 05:57 AM IST
వేషం మారింది వాయిస్ మారలేదు: రెండవ సాంగ్ తో ఫిదా చేసిన రణు మండల్‌

Updated On : August 31, 2019 / 5:57 AM IST

సోషల్ మీడియాలో టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిన వాళ్లు చాలామంది ఉన్నారు.  ఇలాగే రైల్వే స్టేషన్‌ లో పాటలు పాడుతూ దీన స్థితిలో కాలం గడుపుతున్న రణు మండల్‌ కూడా ఓవర్‌ నైట్ స్టార్‌ అయిన విషయం తెలిసిందే. తన వాయిస్ తో అందరినీ ఆకట్టుకుని సింగర్ గా మారిపోయింది. ఆమె వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆమె జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మొన్నటివరకు అడుక్కుంటూ బ్రతికిన ఆమె రూపం.. వేషం మారిపోయింది. 

ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్‌ లో వరుస అవకాశాలు లభిస్తున్నాయి. బాలీవుడ్‌ సంగీత దర్శకుడు హిమేశ్‌ రేష్మియా తన సినిమాలో పాట పాడే అవకాశాన్ని కల్పించాడు. తేరీ మేరీ కహానీ.. అంటూ తొలి పాటను ఆలపించగా అది బ్లాక్‌ బస్టర్‌ గా మారింది. తాజాగా హిమేశ్‌ రేష్మియా ఆమెతో రెండో సాంగ్ పాడించాడు. దానికి సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో రణు పాడుతుండగా.. హిమేశ్ వాయిస్ ఓవర్ చేస్తుంటాడు. 

కేవలం రన్నింగ్ ట్రైన్‌లో పాడిన పాటే తన తలరాతను మార్చేస్తుందని బహుశా ఆమె కూడా ఊహించి ఉండదు. ఇక ఇప్పటినుంచి ఆమె ఎవరిని అడుక్కోవాలిసిన అవసరం లేదు. తన ఇంటికే ఆఫర్లు క్యూ కట్టి వస్తాయి. తన టాలెంట్‌ చూసి రీసెంట్ గా హీరో సల్మాన్‌ ఖాన్‌ కూడా కళ్లు చెదిరే గిఫ్ట్‌ ఇచ్చాడు.