గ్లామర్ డోస్ పెంచిన రష్మిక.. హీట్ ఎక్కిస్తున్నావంటున్న నెటిజన్స్..

లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా పలు ఛాలెంజ్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ‘బి ది రియల్ మేన్’, ‘నో మేకప్’, ‘గ్రీన్ ఇండియా’ తదితర ఛాలెంజ్‌లలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తాజాగా మరో ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. అదే ‘బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్’.
#womensupportingwomen అనే హ్యష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్న ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు తమ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. మహిళల్లోని ఆత్మవిశ్వాసాన్ని, సాధికారతను పెంపొందించడమే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. ఈ ఛాలెంజ్‌లో భాగంగా యంగ్ హీరోయిన్ రష్మిక తాజాగా తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గ్లామరస్ లుక్‌లో రష్మిక నెటిజన్లను ఫిదా చేసింది. 17 లక్షలకు పైగా లైకులు సాధించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న ‘పుష్ప’లో నటించనుంది రష్మిక.
https://www.instagram.com/p/CDMY7-9pe3p/?utm_source=ig_web_copy_link