Naatu Naatu : IPL వేదికపై రష్మిక నాటు నాటు పర్ఫార్మెన్స్.. ఇరగొట్టేసింది!

2023 ఐపీఎల్ (IPL) మొదలైంది. ఈ ఐపీఎల్ ఓపెనింగ్ ఈవెంట్ లో రష్మిక మందన్న (Rashmika Mandanna) నాటు నాటు సాంగ్ పర్ఫార్మ్ చేసి ఇరగొట్టేసింది.

Naatu Naatu : IPL వేదికపై రష్మిక నాటు నాటు పర్ఫార్మెన్స్.. ఇరగొట్టేసింది!

Rashmika Mandanna Performed Naatu Naatu at IPL opening ceremony

Updated On : March 31, 2023 / 10:25 PM IST

Naatu Naatu : క్రికెట్ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొదలై పోయింది. ఈరోజు (మార్చి 31) నుంచి ఐపీఎల్ 16వ సీజన్ స్టార్ట్ అయ్యింది. మే 28 వరకు ఈ లీగ్ సాగనుంది. ఈ సీజన్ లో మొత్తం 10 టీంలు కప్ కోసం పోరాడబోతున్నాయి. ఇక నేడు మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది. కాగా ఈ సీజన్ ఓపెనింగ్ లో వరల్డ్ ఫేమస్ సాంగ్ నాటు నాటు (Naatu Naatu) పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వబోతున్నారు అన్న దాని పై పెద్ద చర్చ జరిగింది.

Pushpa 2 : పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన సుకుమార్!

IPL లో పర్ఫార్మ్ చేయడానికి ఎన్టీఆర్ (NTR) అండ్ రామ్ చరణ్ (Ram Charan) కు భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వేదిక పై నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నాటు నాటు సాంగ్ ని పర్ఫార్మ్ చేసింది. గోల్డ్ డ్రెస్ లో రష్మిక నాటు నాటు స్టెప్ వేసి ఇరగొట్టేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ IPL లో మరో ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ (Balakrishna) కామెంటరీ చెప్పబోతున్నాడు.

Orange : ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్ అన్ని కోట్లా.. అంతా జనసేన పార్టీకే..

ఇప్పటికే టాక్ షోలు, మ్యూజిక్ షోలతో బాలయ్య సరికొత్త ట్రెండ్ ని సృష్టిస్తున్నాడు. తాజాగా క్రికెట్ కామెంటెర్ గా కూడా అలరించబోతున్నాడు. కాలేజీ చదువుతున్న సమయంలో మాజీ ఇండియన్ కెప్టెన్ మొహ‌మ్మ‌ద్ అజారుద్దీన్‌తో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న బాలకృష్ణ.. ఈ IPL మొదటి మ్యాచ్ కి కామెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో సినీ ప్రియులు కూడా ఈ ఏడాది ఐపీఎల్ చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.