Rashmika Mandanna : ఇక నుంచి రష్మిక ఫ్యాన్స్ అదే సెంట్ వాడతారేమో.. ఎట్టకేలకు మొదలుపెట్టిందిగా..
ఈ కోవలోకి ఇప్పుడు రష్మిక మందన్న చేరింది.

Rashmika Mandanna
Rashmika Mandanna : సినిమా స్టార్స్ అంతా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు. ఓ పక్క సినిమాలతో సంపాదిస్తూనే ఆ స్టార్ డమ్ తో బిజినెస్ లలో పెట్టుబడులు పెడతారు, యాడ్స్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరు హీరోలు, హీరోయిన్స్ ఇదే పని చేస్తారు. ఆల్మోస్ట్ ప్రతి హీరో, హీరోయిన్స్ కి సినిమా కాకుండా పక్కన ఏదో ఒక బిజినెస్ కూడా ఉంది. ఈ కోవలోకి ఇప్పుడు రష్మిక మందన్న చేరింది.
రష్మిక మందన్న పెర్ఫ్యూమ్ బిజినెస్ మొదలుపెట్టింది. డియర్ డైరీ అనే పేరుతో ఈ పెర్ఫ్యూమ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇందులో నాలుగు ఫ్లేవర్స్ ఉన్నాయి. అన్ని కూడా 100ml, 10ml లో దొరుకుతున్నాయి. 100ml కాస్ట్ 2599 కాగా 10ml కాస్ట్ 599 రూపాయలుగా ఉంది. ప్రస్తుతానికి ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి. త్వరలో బయట షాప్స్ లోకి అందుబాటులోకి వస్తాయేమో చూడాలి.
ఇక తన డియర్ డైరీ సెంట్ బిజినెస్ గురించి ఓ వీడియోని షేర్ చేసి.. ఇది నా మనసుకు చాలా దగ్గరైంది. ఇది కేవలం బ్రాండ్ మాత్రమే కాదు, ఇది కేవలం సెంట్ మాత్రమే కాదు నాలో ఒక భాగం. సెంట్ నా జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవాళ నేను దీని గురించి మీతో పంచుకుంటున్నాను. నేను సంతోషంతో పాటు భయంగా కూడా ఉంది. నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అని పోస్ట్ చేసింది. దీంతో ఎట్టకేలకు రష్మిక కూడా బిజినెస్ మొదలుపెట్టిందని, తన స్టార్ డమ్ తో ఆ సెంట్ బిజినెస్ బాగానే అవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.