Naga Vamsi : వాళ్ళే సింగిల్ థియేటర్స్ బతకాలి అంటారు.. వాళ్ళే మల్టిప్లెక్స్‌లు కడతారు.. ఆ నిర్మాతలపై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు..
ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ..

Naga Vamsi
Naga Vamsi : నిర్మాత నాగవంశీ ఏం ఉన్నా డైరెక్ట్ గానే చెప్పేస్తాడని తెలిసిందే. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ వరుసగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలలో కింగ్డమ్ సినిమాతో పాటు థియేటర్స్ సమస్యలు, సినీ పరిశ్రమ సమస్యలు, నిర్మాతల కష్టాలు కూడా చెప్పారు.
ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ.. ఏషియన్ సునీల్, శిరీష్, సురేష్ బాబు వీళ్ళే సింగిల్ థియేటర్స్ ని బతికించాలని అంటున్నారు. కానీ ఏషియన్ సునీల్ ఎక్కడ పడితే అక్కడ మల్టీప్లెక్స్ లు కడుతున్నారు. ఎందుకంటే జనాలు మల్టీప్లెక్స్ లకు రావడానికి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి. మంచిగా మెయింటైన్ చేస్తున్న సింగిల్ స్క్రీన్స్ చాలా ఉన్నాయి. వాటికి జనాలు వస్తున్నారు. కానీ చాలామంది సింగిల్ స్క్రీన్స్ ని మెయింటైన్ చెయ్యట్లేదు. వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. మల్టీప్లెక్స్ ల మీద ఇన్వెస్ట్ తగ్గించండి. మీరు మల్టీప్లెక్స్ ల మీద ఇన్వెస్ట్ చేసి జనాలు రెండిటికి రావాలంటే ఎలా? సింగిల్ స్క్రీన్స్ లో వాష్ రూమ్స్ కూడా సరిగ్గా ఉండవు. రెండు రాష్ట్రాల్లో కొన్ని సింగిల్ స్క్రీన్స్ మాత్రమే బాగుంటాయి. వాటికి జనాలు వస్తున్నారు. ఎగ్జిబిటర్స్ కూడా థియేటర్స్ ని మంచిగా మెయింటైన్ చేసి పర్శంటేజ్ అడగండి. ఏం చేయకుండా ఎలా ఇస్తాము అని అన్నారు.
Also Read : Director Krish : ఎక్కడా కనపడని క్రిష్.. ‘హరి హర వీరమల్లు’ పై పోస్ట్.. అసలు విషయం మాత్రం చెప్పలేదు..
అలాగే.. నేను కూడా థియేటర్స్ బిజినెస్ లోకి వద్దాం అనుకున్నాను. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడున్న పరిస్థితి చెప్పి వద్దన్నారు. అందుకే ఆగాను. నేను వస్తే సింగల్ స్క్రీన్ థియేటర్ కడతాను. ఆసియాలోనే అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్ ఏపీలో కడతాను అని అన్నారు.